ఎయిర్ టెల్ నెట్ వర్క్ యూజర్లకు గుడ్ న్యూస్...Airtel 5G Plus సేవలను 5వేల నగరాలు, పట్టణాలకు విస్తరిస్తోంది. సెప్టెంబర్ 2023 నాటికి విస్తృతమైన కనెక్టివిటీని అందించనుంది. పోస్ట్‌పెయిడ్, ప్రీపెయిడ్‌లో వినియోగదారులకు అపరిమిత 5G సేవలను అందించనుందని ఎయిర్‌టెల్ CEO గోపాల్ విట్టల్ వెల్లడించారు. డాట్ (DoT) నిబంధన లోబడి దేశవ్యాప్తంగా 22 టెలికం సర్కిళ్లలో Airtel 3300 MHz (2100 MHzతో సహా), 26 GHz ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌లపై 5G సేవలను రోల్ అవుట్ చేసినట్లు భారతీ ఎయిర్ టెల్ శనివారం (ఆగస్టు 19న)ప్రకటించింది.
మీరు 5G ఆండ్రాయిడ్ కలిగి ఉన్నట్లయితే.. ఎయిర్‌టెల్ కస్టమర్‌లకు అపరిమిత 5G సేవలను అందిస్తోంది. ఎటువంటి డేటా ఇంటరప్ట్ లేకుండా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పటికే స్మార్ట్ ఫోన్లలో ఇంటర్నెట్ వినియోగం ఉన్నప్పటికీ.. నెట్ వర్క్ స్పీడ్ విషయంలో కొంత ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఎయిర్ టెల్ 5G ఎటువంటి డేటా ఇంటరప్షన్ లేకుండా హైస్పీడ్ సేవలందిస్తోంది. ప్రీపెయిడ్,పోస్ట్‌పెయిడ్ రెండు విభాగాలలో Airtel నుంచి ఎంట్రీ-లెవల్ ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇది మిమ్మల్ని అన్‌లిమిటెడ్ 5G ప్రయోజనాలను ఆస్వాదింపజేస్తుంది.