ఎయిర్​టెల్, వీఐ​ చార్జీలూ పెరిగాయ్​

ఎయిర్​టెల్, వీఐ​ చార్జీలూ పెరిగాయ్​

న్యూఢిల్లీ: భారతీ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెల్, వొడాఫోన్​ ఐడియా (వీఐ) శుక్రవారం ప్రీపెయిడ్,  పోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పెయిడ్ మొబైల్ టారిఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను 10-–21 శాతం పెంచుతునట్టు తెలిపాయి. తమ ప్రత్యర్థి రిలయన్స్ జియో టారిఫ్​ పెంపును ప్రకటించిన మరునాడే ఈ నిర్ణయాన్ని ప్రకటించాయి.   ఎయిర్​టెల్​, కొత్త చార్జీలు  జులై 3 నుంచి, వీఐ చార్జీలు జులై 4 నుంచి అమలులోకి వస్తాయి.  ఎయిర్​టెల్​లో రోజువారీ డేటా యాడ్-ఆన్ (1జీబీ) రేటు రూ. మూడు.. అంటే రూ. 19 నుంచి రూ. 22కి పెరుగుతుంది. రోజుకు 2జీబీ డేటా, 365-రోజుల వ్యాలిడిటీ ఇచ్చే ప్లాన్​రేటును రూ.600 పెంచింది.  

దీని ధర రూ.2,999 నుంచి రూ.3,599కి చేరనుంది.   అన్​లిమిటెడ్​ వాయిస్ ప్లాన్ కేటగిరీలో.. రూ. 179 రీచార్జ్​ ప్లాన్​ ధరను రూ. 199కి పెంచింది.  నెలకు 2జీబీ డేటాను అందించే ఈ 28 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ. 20 పెరుగుదల ఉంది. బడ్జెట్ వినియోగదారులపై  భారం పడకుండా ఉండేందుకు ఎంట్రీ-లెవల్ ప్లాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల ధరలను చాలా తక్కువగా పెంచామని ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెల్ తెలిపింది. మనదేశంలోని టెల్కోలు ఆర్థికంగా బలంగా ఉండాలంటే ...మొబైల్ యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ (ఏఆర్​పీయూ) రూ. 300 కంటే ఎక్కువగా ఉండాలని పేర్కొంది. 

నెలకు ఒక్కో యూజర్​నుంచి వచ్చే ఆదాయాన్ని ఏఆర్​పీయూ అంటారు. ధరల పెంపుతో వచ్చే డబ్బును టెక్నాలజీ, పెట్టుబడుల కోసం వాడతామని కంపెనీ తెలిపింది.   భారతదేశపు అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయిన జియో గురువారం మొబైల్ టారిఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను 12–-27 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది.  రెండు టెల్కోలు వరుసగా ప్రకటించిన టారిఫ్  రేట్ పెంపులను పరిశీలిస్తే, చాలా ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెల్ మొబైల్ ప్లాన్ల ధరలు రిలయన్స్ జియో కంటే ఎక్కువగా ఉన్నాయి. ఇందుకు  ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెల్ స్పందిస్తూ,  ప్రపంచంలోని ఇతర ప్రాంతాలతో పోల్చితే భారతదేశంలోనే టారిఫ్​లు తక్కువగా ఉన్నాయని పేర్కొంది. పెంపుతో టెలికం ఇండస్ట్రీకి మేలు జరుగుతుందని ఇక్రా తెలిపింది.