హైదరాబాద్, వెలుగు: స్పామ్ కాల్స్, ఎస్ఎంఎస్లను గుర్తించి కస్టమర్‌ను అప్రమత్తం చేయడానికి ఏఐ ఆధారిత స్పామ్ డిటెక్షన్ సొల్యూషన్‌ను ప్రవేశపెట్టినట్టు ఎయిర్టెల్ ప్రకటించింది. ఇది నెట్‌వర్క్ ఆధారిత టూల్అని, కస్టమర్లు దీనిని ఉచితంగానే వాడుకోవచ్చని తెలిపింది. అనుమానిత స్పామ్ గురించి రియల్‌టైంలో హెచ్చరిస్తుంది.
డ్యూయల్- లేయర్ ప్రొటెక్షన్ సిస్టమ్ ప్రతిరోజూ బిలియన్ల కొద్దీ కాల్స్‌ను, మెసేజ్‌లను ప్రాసెస్ చేస్తుంది. ఈ సేవలు వాడుకోవడానికి ప్రత్యేకంగా యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లో దీనిని పది రోజుల క్రితం ప్రారంభించగా, 122 మిలియన్ల స్పామ్ కాల్స్‌ను, 2.3 మిలియన్ల స్పామ్ ఎస్ఎంఎస్లను బ్లాక్ చేసిందని వెల్లడించింది.