5జీ నెట్‌‌‌‌వర్క్ విస్తరించేందుకు.. ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్‌‌‌‌–నోకియా జత

5జీ నెట్‌‌‌‌వర్క్ విస్తరించేందుకు.. ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్‌‌‌‌–నోకియా జత

న్యూఢిల్లీ:  5జీ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ను మరింతగా విస్తరించడానికి  టెలికం ఎక్విప్‌‌‌‌మెంట్ల తయారీ కంపెనీ నోకియాతో  ఎయిర్‌‌‌‌టెల్ పార్టనర్‌‌‌‌‌‌‌‌షిప్ కుదుర్చుకుంది. వోల్టె (వాయిస్ ఓవర్ ఎల్‌‌‌‌టీఈ), హెచ్‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ (హోమ్ సబ్‌‌‌‌స్క్రయిబర్ సర్వర్) మొదలైన  కోర్ టెక్నాలజీలను ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్‌‌‌‌కు నోకియా అందిస్తోంది. 

తాజా పార్టనర్‌‌‌‌‌‌‌‌షిప్ కింద 5జీ కి  సంబంధించిన కోర్‌‌‌‌‌‌‌‌ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ను అందించనుంది. ‘‘పెరుగుతున్న 4జీ/5జీ కస్టమర్లకు మెరుగైన సర్వీస్‌‌‌‌లను  అందించడానికి నోకియాతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాం.   ప్యాకెట్ కోర్ అప్లయన్స్–-బేస్డ్, ఫిక్స్డ్‌‌‌‌  వైర్‌‌‌‌లెస్ యాక్సెస్ (ఎఫ్‌‌‌‌డబ్ల్యూఏ) సొల్యూషన్‌‌‌‌లను నోకియా అందిస్తుంది’’ అని ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్‌‌‌‌ ఓ స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌లో పేర్కొంది.