బార్సిలోనా: దేశంలో రెండో అతిపెద్ద టెలికాం సంస్థ భారతీ ఎయిర్ టెల్, ఫిన్నిస్ టెలికాం దిగ్గజం నోకియాతో చేతులు కలిపింది. ఈ భాగస్వామ్యంలో 5జీ, 4జీ సర్వీసులకు సపోర్ట్ చేసే సొల్యుషన్స్ ట్రయల్స్ ను ఇది నిర్వహించబోతుంది. ‘తక్కువ సమయంలో ఆల్ట్రా హై స్పీడ్‌ను అందించడానికి అధునాతన ట్రాన్స్ పోర్ట్ సదుపాయాలు అవసరం. ఇది 5జీతోనే సాధ్యమవుతుంది. 5జీ కోసం నెట్ వర్క్స్ రూపొందించేందుకు ఇది ఎంతో కీలకమైన అడుగు. భారతీ ఎయిర్ టెల్ తో కలిసి ఈ ట్రయల్స్ ను నిర్వహించనున్నాం’ అని నోకియా ఇండియా మార్కెట్ హెడ్ సంజయ్ మాలిక్ చెప్పారు. ఇండియాలో విపరీతంగా పెరుగుతున్న హై స్పీడు డేటాను అందుకోవడం కోసం ఎయిర్ టెల్ ఈ ట్రయల్స్ ను నిర్వహిస్తోంది. అయితే ఈ ట్రయల్స్ నిర్వహించేందుకు అధికారిక తేదీలను ఇంకా నిర్ణయించలేదు.
Fronthaul is the link between baseband unit and radio, and modernisation of this part of the network is essential to deliver high-speed and low latency of 5G services. https://t.co/24Rm7alfrd
— Indiacom (@indiacom) February 24, 2019
Bharti Airtel to Trial Nokia's Fronthaul Solution to Support 4G and 5G RAN pic.twitter.com/vG0pOvlOfy
— 5G (@5GTechNews) February 25, 2019