
న్యూఢిల్లీ: భారతదేశంలోని తన కస్టమర్లకు స్టార్‌లింక్ హై-స్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందించడానికి ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు టెలికాం ఆపరేటర్ భారతీ ఎయిర్‌టెల్ మంగళవారం తెలిపింది. అయితే, శాటిలైట్కమ్యూనికేషన్ ఆధారిత సేవలను అందించడానికి స్పేస్‌ఎక్స్ అనుమతులను పొందాల్సి ఉంటుందని ఎయిర్‌టెల్ ఒక ప్రకటనలో తెలిపింది.
భారతీ ఎయిర్‌టెల్ మేనేజింగ్ డైరెక్టర్ వైస్ చైర్మన్ గోపాల్ విఠల్ మాట్లాడుతూ, మనదేశంలోని ఎయిర్‌టెల్ కస్టమర్లకు స్టార్‌లింక్ సేవలను అందించడానికి స్పేస్‌ఎక్స్‌తో కలిసి పనిచేయడం తమకు ముఖ్యమైన మైలురాయి అని అన్నారు. ఈ ఒప్పందం వల్ల మనదేశంలోని అత్యంత మారుమూల ప్రాంతాలకు కూడా హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్‌ను తీసుకురాగలమని చెప్పారు. నెట్వర్క్ కెపాసిటీని పెంచుకునేందుకు రెండు కంపెనీలు కలసి పనిచేస్తాయని అన్నారు. స్పేస్ఎక్స్తమ ఇన్ఫ్రాను కూడా ఉపయోగించుకుంటుందని గోపాల్ వెల్లడించారు.