ఎయిర్ టెల్ యూజర్లకు బిగ్ అలర్ట్.. ఇకపై తెలుగులోనూ స్పామ్​హెచ్చరికలు

ఎయిర్ టెల్ యూజర్లకు బిగ్ అలర్ట్.. ఇకపై తెలుగులోనూ స్పామ్​హెచ్చరికలు

హైదరాబాద్, వెలుగు: తమ కస్టమర్లకు ఇక నుంచి తెలుగు సహా తొమ్మిది ప్రాంతీయ భాషల్లో స్పామ్​కాల్స్​హెచ్చరికలు పంపిస్తామని టెలికం ఆపరేటర్​ఎయిర్​టెల్​తెలిపింది. ఇదివరకే ఏఐ ఆధారిత స్పామ్ డిటెక్షన్ టూల్‎ను అందుబాటులోకి తెచ్చామని పేర్కొంది. ఇది   27.5 బిలియన్లకు పైగా కాల్స్‎ను స్పామ్ గా గుర్తించింది. స్పామర్ల కంటే ముందుండాలనే లక్ష్యంతో ఈ ఫీచర్లను ప్రవేశపెట్టినట్లు ఎయిర్​టెల్​తెలిపింది.  

ఏఐ ఆధారిత టూల్ ఇప్పుడు అంతర్జాతీయ నెట్ వర్క్ ల నుంచి వచ్చే అన్ని స్పామ్ కాల్స్​ను,  ఎస్ఎంఎస్ లను పరిశీలించి కస్టమర్లను అప్రమత్తం చేస్తుంది.  మోసగాళ్లు, స్పామర్లు మోసపూరిత కాల్స్ ను భారత్ లోకి పంపేందుకు విదేశీ నెట్ వర్క్ లను ఉపయోగించుకోవడంతో గత ఆరు నెలల్లో విదేశీ స్పామ్ కాల్స్ 12శాతం పెరిగాయి. ఈ కొత్త ఫీచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఇలాంటి కాల్స్​ను అడ్డుకోవచ్చని ఎయిర్​టెల్​ తెలిపింది.