
న్యూఢిల్లీ: ఎయిర్‌టెల్ తన కస్టమర్లకు పది నిమిషాల్లో సిమ్ కార్డులను డెలివరీ చేయడానికి క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ బ్లింకిట్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. మొదట ఈ సేవ ఢిల్లీ, గురుగ్రామ్, ఫరీదాబాద్, సోనిపట్, అహ్మదాబాద్, సూరత్, చెన్నై, భోపాల్, ఇండోర్, బెంగళూరు, ముంబై, పూణే, లక్నో, జైపూర్, కోల్‌కతా, హైదరాబాద్ సహా 16 ప్రధాన నగరాల్లో అందుబాటులో ఉంటుంది.
తరువాతి దశలో మరి కొన్ని నగరాల్లో, పట్టణాల్లో అందుబాటులోకి వస్తుందని ఎయిర్టెల్ఒక ప్రకటనలో తెలిపింది. రూ.49 చెల్లించి కస్టమర్లు సిమ్‌కార్డును తీసుకోవచ్చు. సిమ్ కార్డ్ డెలివరీ అయిన తర్వాత ఆధార్ ఆధారిత కేవైసీ వెరిఫికేషన్‌తో నంబర్‌ను యాక్టివేట్ చేయించుకోవాలి. కస్టమర్లు పోస్ట్‌పెయిడ్, ప్రీపెయిడ్ ప్లాన్ల నుంచి ఏదో ఒకదానిని ఎంచుకోవచ్చు.