న్యూఢిల్లీ : భారతీ ఎయిర్టెల్ మ్యూజిక్ వర్టికల్ నుంచి తప్పుకుంది. దాని వింక్ మ్యూజిక్ యాప్‌ను మూసివేయనున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. కంపెనీ వింక్వింక్ ఉద్యోగులందరినీ ఇతర చోట్లకు బదిలీ చేస్తుంది. వచ్చే రెండు నెలల్లో వింక్ మ్యూజిక్‌ను మూసివేయాలని ఎయిర్టెల్ యోచిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
వింక్‌ను మూసేస్తున్నామని, అయితే ఎయిర్టెల్ వినియోగదారులు ఇక నుంచి కూడా యాపిల్ మ్యూజిక్ సేవలను ఉపయోగించుకోవచ్చని కంపెనీ అధికార ప్రతినిధి ప్రకటించారు. ఐఫోన్‌ను ఉపయోగించే వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్లతో ఆపిల్ మ్యూజిక్కు యాక్సెస్‌ను అందించడానికి కంపెనీ ఆపిల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.