కీ ప్యాడ్ ఫోన్లలో ఎయిర్టెల్ సిమ్ వాడుతున్న పబ్లిక్కు గుడ్ న్యూస్..

కీ ప్యాడ్ ఫోన్లలో ఎయిర్టెల్ సిమ్ వాడుతున్న పబ్లిక్కు గుడ్ న్యూస్..

భారత్లో అత్యధిక యూజర్లు కలిగిన టెలికాం నెట్వర్స్క్లో ఎయిర్టెల్ ఒకటి. అలాంటి ఎయిర్టెల్ తాజాగా తమ టెలికాం యూజర్లకు కొంత ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. 2జీ ఫీచర్ ఫోన్ యూజర్ల కోసం వాయిస్ ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకురావాలని ట్రాయ్ ఇప్పటికే ఆదేశించిన సంగతి తెలిసిందే. ట్రాయ్ నిబంధనలకు అనుగుణంగా ఎయిర్టెల్ వాయిస్ ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్ల ధరల్లో మార్పులుచేర్పులు చేసింది. ఏడు రోజుల క్రితం ఎయిర్ టెల్ రెండు వాయిస్ ఓన్లీ ప్లాన్లను తీసుకొచ్చింది.

84 రోజుల వ్యాలిడిటీతో 499 రూపాయల రీఛార్జ్ ప్లాన్, 365 రోజుల వ్యాలిడిటీతో 1,959 రూపాయల వాయిస్ ఓన్లీ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చిన ఎయిర్ లెట్ ఈ ప్లాన్ల ధరలను తాజాగా తగ్గించింది. 499 రూపాయల వాయిస్ ఓన్లీ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ను 469 రూపాయలకు, 1,959 రూపాయల వాయిస్ ఓన్లీ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ను 1849 రూపాయలకు ఎయిర్ టెల్ తగ్గించింది. అంటే.. 499 ప్లాన్పై 30 రూపాయలు, 1,959 ప్లాన్ పై 110 రూపాయల తగ్గింపును ఎయిర్ టెల్ ప్రకటించింది. ఎయిర్ టెల్ సిమ్ వాడుతున్న 2జీ ఫీచర్ ఫోన్ యూజర్లకు ఇది కొంత ఊరట కలిగించే విషయమే.

469 రూపాయల వాయిస్ ఓన్లీ ప్లాన్ బెన్ఫిట్స్:
* 84 రోజుల వ్యాలిడిటీ
* అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్ 
* ఫ్రీ నేషనల్ రోమింగ్
* 900 ఉచిత ఎస్ఎంఎస్లు

1,849 రూపాయల వాయిస్ ఓన్లీ ప్లాన్ బెన్ఫిట్స్:
* అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్ 
* 3,600 ఉచిత ఎస్ఎంఎస్లు
* ఫ్రీ నేషనల్ రోమింగ్
* 365 రోజుల వ్యాలిడిటీ

2జీ యూజర్ల కోసం జియో కూడా ఈ వాయిస్ ఓన్లీ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ట్రాయ్ మార్గదర్శకాలకు అనుగుణంగా జియో 458 రూపాయలు, 1,958 రూపాయల వాయిస్ ఓన్లీ ప్లాన్లను 2జీ యూజర్లకు అందుబాటులో ఉంచింది. జియో తీసుకొచ్చిన ఈ ప్లాన్లకు ధీటుగా ఎయిర్ టెల్ కూడా వాయిస్ ఓన్లీ రీఛార్జ్ ప్లాన్ల ధరలను తగ్గించింది. జియో తీసుకొచ్చిన వాయిస్ ఓన్లీ ప్లాన్ల బెన్ఫిట్స్పై ఓ లుక్కేద్దాం.

458 రూపాయల జియో వాయిస్ ఓన్లీ ప్లాన్ బెన్ఫిట్స్:
* 84 రోజుల వ్యాలిడిటీ
* అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్ 
* 1000 ఉచిత ఎస్ఎంఎస్లు

1,958 రూపాయల జియో వాయిస్ ఓన్లీ ప్లాన్ బెన్ఫిట్స్:
* 365 రోజుల వ్యాలిడిటీ
* అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్ 
* 3,600 ఉచిత ఎస్ఎంఎస్లు