హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఏండ్ల నుంచి పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే రిలీజ్ చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఫీజు బకాయిలు రాకపోవడంతో కాలేజీ మేనేజ్మెంట్లు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీలను బంద్ చేస్తామని మేనేజ్మెంట్లు ప్రకటించాయని గుర్తుచేశారు. ప్రభుత్వం వెంటనే మేనేజ్మెంట్లతో చర్చలు జరపాలని కోరారు. మేనేజ్మెంట్లు బంద్ నిర్వహిస్తే క్లాసులు నిర్వహణ ఆలస్యమవుతుందని, దీని ప్రభావం సెమిస్టర్ పరీక్షలపైనా పడే అవకాశం ఉందన్నారు.