
హుస్నాబాద్, వెలుగు : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో బీసీ బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జెరిపోతుల జనార్దాన్ కోరారు. మంగళవారం ఆయన మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వినతిపత్రాన్ని ఇచ్చారు. ఇక్కడ బీసీ బాయ్స్ రెసిడెన్షియల్స్కూల్ లేకపోవడంతో విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్తూ ఇబ్బందులు పడుతున్నారన్నారు.
కొందరు మధ్యలోనే చదువు ఆపేస్తున్నారన్నారు. నాలుగు జిల్లాలకు కేంద్రంగా ఉన్న హుస్నాబాద్‌లో మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ బాలుర గురుకుల పాఠశాల ఏర్పాటుచేస్తే ఇక్కడి విద్యార్థులకు సౌకర్యంగా ఉంటుందన్నారు. ఆయన వెంట ఆ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రామగళ్ల నరేశ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ చిట్యాల శేఖర్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు వేల్పుల ప్రసన్నకుమార్, నాయకులు కొమ్ముల భాస్కర్, గణేశ్ ఉన్నారు.