ఇంజినీరింగ్ బీ కేటగిరి సీట్లను కౌన్సెలింగ్ ద్వారానే భర్తీ చేయాలె : ఏఐఎస్​ఎఫ్

ఇంజినీరింగ్ బీ కేటగిరి సీట్లను కౌన్సెలింగ్ ద్వారానే భర్తీ చేయాలె : ఏఐఎస్​ఎఫ్
  • టీజీసీహెచ్ఈ చైర్మన్ లింబాద్రికి ఏఐఎస్ఎఫ్ వినతి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజి నీరింగ్ కాలేజీల్లో బీ కేటగిరి సీట్లను కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయాలని ఏఐఎస్​ఎఫ్  కోరింది. ఈ మేరకు బుధవారం హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రిని.. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్ నేతృత్వంలోని ప్రతినిధులు కలిసి వినతిపత్రం అందించారు. మేనేజ్​మెంట్ కోటాపై సర్కారు నియంత్రణ కరువైందని, దీంతో యాజమాన్యాలు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.

 డిమాండ్ ఉన్న సీట్లను బ్లాక్ చేస్తూ.. ఆ తర్వాత వాటిని మేనేజ్మెంట్ కోటాగా మార్చి లక్షల్లో డొనేషన్లు వసూలు చేస్తున్నారని తెలిపారు. పేరెంట్స్ కు సీట్ల విషయంలో కృత్రిమ కొరత సృష్టించి భారీగా ఫీజులు పెంచుతున్నా రని చెప్పారు. ఇంజినీరింగ్ కాలేజీల్లో అర్హత లేని సిబ్బందిని నియమించుకుంటున్నారని పేర్కొన్నా రు. ప్రభుత్వం వెంటనే ఆయా కాలేజీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో గ్యార నరేశ్, చైతన్య యాదవ్, ఎండీ అన్వర్, హరీశ్, శివ తదితరులు పాల్గొన్నారు.