చలో సెక్రటేరియెట్ ఉద్రిక్తం

చలో సెక్రటేరియెట్ ఉద్రిక్తం
  • ఏఐఎస్ఎఫ్ నాయకుల అరెస్ట్

బషీర్ బాగ్, వెలుగు : ఫీజు రీయింబర్స్​మెంట్, స్కాలర్ షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన ‘చలో సెక్రటేరియెట్’ ఉద్రిక్తతకు దారి తీసింది. తొలుత జీహెచ్ఏంసీ ప్రధాన కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్తున్న కార్యకర్తలు, విద్యార్థులను బీఆర్కే భవన్ వద్ద పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. దీంతో ఆందోళనకారులు రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆందోళన చేస్తున్న నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.

ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షుడు ఎన్ఎ స్టాలిన్ మాట్లాడుతూ.. ప్రభుత్వాలు మారినా విద్యార్థుల జీవితాలు మారడం లేదన్నారు.  రాష్ట్రంలో రూ. 7,650 కోట్ల బకాయిలు పెండింగ్​లో ఉన్నాయన్నారు. మరోవైపు, వర్సిటీల్లో ఖాళీగా ఉన్న 5 వేలకు పైగా టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఉన్నత విద్యామండలి చైర్మన్​ ప్రొఫెసర్​ బాలకిష్టారెడ్డికి ఎస్ఎఫ్ఐ నేతలు శనివారం వినతిపత్రం అందజేశారు.