
అప్పట్లో కజ్రా రేలో (Kajra Re)పాట ఎంత ఫేమస్ అయిందో వేరే చెప్పనక్కర్లేదు. ఆ పాటకు చాలా నుంది స్టెప్పులేసే వాళ్లు. లేటెస్ట్గా ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ జంట కజ్రా రే పాటకు స్టెప్పులేశారు.
ఇటీవల పుణేలో జరిగిన ఐశ్వర్య కజిన్ పెళ్లి వేడుకలో ఐశ్వర్య రాయ్ మరియు అభిషేక్ బచ్చన్ తమ కుమార్తె ఆరాధ్యతో కలిసి హాజరయ్యారు. ఈ క్రమంలో అభిషేక్, ఐశ్వర్య కలిసి ఐకానిక్ నంబర్ కజ్రా రే పాటకు డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకున్నారు. కూతురు ఆరాధ్య సైతం తన తల్లి ఐశ్వర్యను చూసి స్టెప్స్ నేర్చుకోవడానికి ప్రయత్నించింది. దానికి తోడు అభిషేక్, ఐశ్వర్య మధ్య కెమిస్ట్రీ మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఎందుకంటే, ఇన్నాళ్లు.. ఐశ్వర్య, అభిషేక్ విడాకులు తీసుకుంటున్నారని రూమర్స్ వింటూ వచ్చాం. ఈ క్రమంలో, ఇద్దరూ ఉత్సహంగా డ్యాన్స్ చేయడం అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ALSO READ : పార్లమెంటుకు చేరిన L2:ఎంపురాన్ వివాదం..
ఈ వీడియోలో ఐశ్వర్య పసుపు రంగు సూట్‌లో అందంగా కనిపించగా, అభిషేక్ గులాబీ రంగు కుర్తా, తెల్లటి పైజామాలో మెరిసిపోయాడు. మరోవైపు ఆరాధ్య తెల్లటి లెహంగా ధరించింది.
aishwarya rai dancing to kajra re in 2025 😍🤗⬇️
— HDactress.com (@HDactressTweets) April 3, 2025
For More : https://t.co/1bgEzj56Dr ✅ pic.twitter.com/HzvVln1eB7
కజ్రా రే పాట విషయానికి వస్తే..
ఈ సాంగ్ బంటీ ఔర్ బబ్లీ (2005) సినిమాలోనిది. ఇది అభిషేక్, ఐశ్వర్య మరియు అమితాబ్ బచ్చన్‌లపై చిత్రీకరించబడింది. శంకర్-ఎహసాన్-లాయ్ సంగీతం అందించగా.. గుల్జార్ సాహిత్యం ఇచ్చారు. అలీషా చినాయ్, శంకర్ మహదేవన్ మరియు జావేద్ అలీ పాడారు.