తమిళ స్టార్ ధనుష్ (Dhanush), ఐశ్వర్య రజనీకాంత్ (Aishwarya Rajinikanth) తమ వివాహ బంధానికి ముగింపు పలికిన విషయం తెలిసిందే. 2022 జనవరిలో తాము విడిపోతున్నట్లు ప్రకటించారు ఈ జంట. ఈ ప్రకటన చేసిన దాదాపు రెండేళ్లకు ఇప్పుడు ఈ జంట విడాకుల కోసం అప్లై చేసుకున్నారు. సెక్షన్ 13బీ ప్రకారం చెన్నైలోని ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఈ పిటీషన్ పై త్వరలోనే విచారణ జరుగనుంది.
🙏🙏🙏🙏🙏 pic.twitter.com/hAPu2aPp4n
— Dhanush (@dhanushkraja) January 17, 2022
ఇక తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్దకుమార్తె అయిన ఐశ్వర్య రజినీకాంత్, ధనుష్ ల వివాహం 2004 నవంబర్ 18న జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వారి పేర్లు యాత్ర, లింగ. ఇక విడిపోతున్నట్లు ప్రకటించిన తరువాత గత రెండేళ్లుగా ఈ ఇద్దరు విడివిడిగానే ఉంటున్నారు.