బాలీవుడ్ స్టార్ కపుల్ అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan), ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai) విడిపోతున్నారంటూ గత కొంత కాలంగా టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. విడి విడిగా కనబడిన ప్రతిసారి వీరిద్దరూ వేరుగా ఉంటున్నారని రూమర్స్ ఊపందుకుంటున్నాయి. ఆ మధ్యలో కోడలు ఐశ్వర్య రాయ్‌ను అమితాబ్ సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేసాడని కూడా వైరల్ అయింది.
అలాగే అంబానీ పెళ్ళిలో అభిషేక్, ఐశ్వర్య విడివిడిగా రావటంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కామెంట్స్ కి ఫుల్ స్టాప్ పెట్టారు అభిషేక్, ఐశ్వర్య. అదేలా అనే వివరాల్లోకి వెళితే..
ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ ల ముద్దుల కుమార్తె ఆరాధ్య (Aaradhya Bachchan) ముంబైలో 'ధీరూభాయ్ అంబానీ స్కూల్‌లో' చదువుతుంది. నిన్న గురువారం(Dec 19న) సాయంత్రం ఆ స్కూల్ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఈ వార్షిక దినోత్సవ కార్యక్రమానికి అభిషేక్, ఐశ్వర్యతో పాటు అమితాబ్ బచ్చన్ కూడా హాజరయ్యారు. తన మనవరాలు ఆరాధ్య కోసం బిగ్ బి వచ్చి సందడి చేశారు. ఈ ఫంక్షన్‌లో ఐశ్వర్య మరియు అభిషేక్ ఆరాధ్య ఇచ్చే ప్రదర్శనను రికార్డ్ చేస్తూ కనిపించారు. అంతేకాకుండా అభిషేక్ విద్యార్థులతో కలిసి డ్యాన్స్ చేశారు. దీంతో అభిషేక్, ఐశ్వర్యల విడాకులు పుకార్లు తుడుచుకుపోయాయి
Aaradhya and Abram singing together at their school annual function ♥️
— AISHWARYA RAI 💙 (@my_aishwarya) December 19, 2024
##aaradhyabachchsn #AbRamKhan #AishwaryaRai #ShahRukhKhan pic.twitter.com/vBYZx6eMTH
అలాగే ఈ ఈవెంట్కి షారుఖ్ ఖాన్ తన ఫ్యామిలీతో వచ్చాడు. అతని చిన్న కుమారుడు అబ్రం కూడా ఇదే స్కూల్ లో చదువుతున్నాడు. ఐశ్వర్య కుమార్తె ఆరాధ్య, షారుక్ ఖాన్ తనయుడు అబ్రం కలిసి స్టేజ్ షో చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోస్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే.. ధీరూభాయ్ అంబానీ స్కూల్‌లో బాలీవుడ్ సెలబ్రీటీల పిల్లలు చదువుతున్నారు.