బాలీవుడ్ స్టార్ కపుల్ అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan), ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai) విడిపోతున్నారంటూ గత కొంత కాలంగా టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల వివాహ వేడుకకు ఇద్దరూ విడివిడిగా రావటంతో అనుమానాలు మరింత బలపడ్డాయి.
అలాగే, ఐశ్వర్య ముంబైలోని బిగ్‌బీ ఇంటి నుంచి వచ్చేశారని, ఓ డాక్టర్‌తో ఐష్ సన్నిహితంగా ఉంటుందంటూ రకరకాల వార్తలు మీడియాలో వచ్చాయి. దీంతో అభిషేక్, ఐశ్వర్య విడిపోవటం నిజమే అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే, రూమర్లకు ఫుల్ స్టాప్ పెట్టేలా తాజాగా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్నాయి.
తాజాగా అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ జంట దుబాయ్ వెకేషన్‌కు వెళ్ళింది. ఈ జంట తమ కుమార్తె ఆరాధ్యతో కలిసి దుబాయ్ విమానాశ్రయంలో కనిపించారు. ముగ్గురు దుబాయ్ ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వచ్చి బస్సు ఎక్కుతున్నారు. ఈ వీడియోలో ‘దుబాయ్ ఎయిర్‌పోర్ట్’ అని రాసి ఉంది. దాంతో విడాకుల చర్చలు కేవలం పుకార్లు మాత్రమే అని..ఈ ఇద్దరూ ఇప్పటికీ కలిసి ఉన్నారని ఈ వీడియో చూస్తే అర్ధమవుతోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో అన్ని రూమర్లకు చెక్ పడినట్లయింది.
ALSO READ | Jr NTR: కేశవనాథేశ్వర ఆలయాన్ని దర్శించుకున్న ఎన్టీఆర్..వీడియో పోస్ట్ చేసిన రిషబ్ శెట్టి
అయితే, ఇక్కడ మరో ట్విస్ట్ మొదలైంది. సోషల్ మీడియాలో కాస్త వెతికితే ఈ వీడియో ఫిబ్రవరి నెలకి సంబంధించిన వీడియో అని కామెంట్స్ మొదలయ్యాయి. ‘ఇది పాత వీడియో’ అని కొంతమంది కామెంట్ చేయగా..‘గతేడాది అవార్డ్స్ షో కోసం వెళ్లినప్పటి వీడియో’ అని ఇంకొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇందులో ఏది నిజమో తెలియాల్సి ఉంది.