
బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ కారుకు ముంబైలో ప్రమాదం జరిగింది. మార్చి 26న ముంబైలోని జుహులో ఐశ్వర్య రాయ్ కారును బెస్ట్ బస్సు ఢీకొట్టింది. ఓ నెటిజన్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో వీడియో షేర్ చేయడంతో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దాంతో ఐశ్వర్య రాయ్ అభిమానులు ఆమెకు ఎలా ఉందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయితే, లేటెస్ట్ బాలీవుడ్ రిపోర్ట్స్ ప్రకారం.. ఈ ప్రమాదం వల్ల పెద్దగా నష్టమేమి జరగలేదని సమాచారం. బస్సు ఢీకొన్న వెంటనే, అందులో ఉన్న ఐశ్వర్య బాడీగార్డ్స్ దిగి, ఆ బస్సు డ్రైవర్ ని నిలదీసినట్లు టాక్. ఇక కారుకు ఎటువంటి నష్టం జరగకపోవడంతో అంతా కూల్ అయినట్లు తెలుస్తోంది.
ఇకపోతే, ప్రమాదం జరిగిన సమయంలో ఐశ్వర్య రాయ్ కారులో లేదని, ఎవరికీ గాయాలు కాలేదని కొన్ని రిపోర్టులు చెబుతున్నాయి. కానీ ఈ చిన్న ప్రమాదం ముంబై రహదారి భద్రతా సమస్యలను లేవనెత్తుతుంది. ప్రస్తుతం ఈ సంఘటనపై మీడియాలో ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుకుంటున్నారు.
►ALSO READ | Prabhas Marriage: త్వరలో ప్రభాస్ పెళ్లి జరగబోతుందా..? : హైదరాబాద్ వ్యాపారవేత్త కుమార్తెతో..
అయితే, ఈ సంఘటనపై పోలీసుల వెర్షన్ మరోలా ఉంది. ముందు నుంచి వెళ్తున్న కారు సడెన్ గా ఆగి ఉండటంతో, కారు వెనుక వస్తున్న బస్సు పదే పదే హారన్ మోగించాడు. దాంతో ఎందుకలా హారన్ కొడుతున్నావంటూ ఐశ్వర్య కారు డ్రైవర్, కిందికి దిగి ప్రశ్నించాడని, అంతే తప్ప అక్కడ ఎటువంటి ప్రమాదం జరగలేదని ఓ పోలీస్ ఆఫీసర్ చెప్పినట్లు సమాచారం. మరి అసలు నిజం ఏంటనేది తెలియాలంటే.. ఐశ్వర్య రాయ్ స్పందించాల్సిందే.