OTT Crime Thriller: ఓటీటీలోకి ఐశ్వ‌ర్య రాజేష్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ - ఎక్కడ చూడాలంటే?

OTT Crime Thriller: ఓటీటీలోకి ఐశ్వ‌ర్య రాజేష్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ - ఎక్కడ చూడాలంటే?

హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో మూడేళ్ళ కిందట నటించిన సినిమా ‘డ్రైవర్ జమున’. పి. క్లిన్ సిన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా క‌మ‌ర్షియ‌ల్గా మంచి విజయం సాధించింది. 2022లో రిలీజైన ఈ మూవీ క్రైమ్ థ్రిల్లర్ అంశాలతో ఉత్కంఠభరితంగా సాగింది. ఊహించని మలుపులతో ప్రేక్షకులను థ్రిల్ చేసింది. 

అయితే, ఇపుడు ఈ డ్రైవర్ జమున మూవీ మూడేళ్ల త‌ర్వాత అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్కి వచ్చింది. ప్రైమ్లో కేవలం తమిళ వెర్షన్ లో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. త్వరలో తెలుగు భాషలో కూడా స్ట్రీమింగ్కు రానుంది. 

ఇప్పటికే, డ్రైవర్ జమున ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది.  ఇందులో క్యాబ్ డ్రైవర్ గా ఐశ్వర్య నటన సినిమాకు హైలైట్ గా నిలిచింది.  ఈ సినిమాను 18 రీల్స్ బ్యానర్పై ఎస్పీ చౌదరీ నిర్మించారు.

ఐశ్వర్య రాజేష్ ఇటీవలే సంక్రాంతికి వస్తున్నాం మూవీతో భారీ హిట్ అందుకుంది. తన నటనకు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దాంతో తాను మూడేళ్ళ కిందట నటించిన డ్రైవర్ జమున సినిమాను ప్రైమ్ ఇపుడు అందుబాటులోకి తీసుకొచ్చింది. అలాగే ఫిబ్రవరి 28న వచ్చిన క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ 'సుడల్‌: ది వొర్టెక్స్‌-సీజన్ 2' ప్రైమ్లో దుమ్మురేపుతోంది. 

కథేంటంటే:

ఇంట్లో పెద్దవాళ్ళ మాట కాదని జమున(ఐశ్వర్య రాజేష్) క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తూ ఉంటుంది. మరోపక్క ఒక రౌడీ బ్యాచ్ ఒక రాజకీయ నేతను హత్య చేయడానికి పథకం వేస్తారు. అనుకోకుండా ఆ రౌడీ బ్యాచ్.. జమున క్యాబ్ లో ఎక్కుతారు.. 90 నిమిషాల ఆ ప్రయాణంలో జమున ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది..?

ALSO READ | Court Review: నాని నిర్మించిన ‘కోర్ట్’ రివ్యూ.. ఉత్కంఠగా సాగే కోర్ట్ రూమ్ డ్రామా

ఆ కిల్ల‌ర్స్‌ను పోలీసుల‌కు ప‌ట్టించాల‌ని అనుకున్న జ‌మున ప్లాన్ ఎలా తిరగబడుతుంది? ఆ హంత‌కుల చేతిలో ఆమె బంధీగా ఎలా  మారిపోతుంది? చివరికి ఆ కిల్ల‌ర్స్ గ్యాంగ్‌ బారి నుంచి ప్రాణాల‌తో ఎలా బ‌య‌ట‌ప‌డింది?  రాజకీయ నేతను కాపాడడానికి ఆమె ఏమేమి ప్రయత్నాలు చేసింది..? అసలు ఆ కిల్లర్స్ ఎందుకు రాజకీయ నాయకుడిని చంపడానికి ప్లాన్ వేశారు? అనేది స్టోరీ.