లవ్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌తో ఐశ్వర్య బాలీవుడ్ ఎంట్రీ

రజినీకాంత్‌‌‌‌ కూతురిగా, ధనుష్‌‌‌‌ భార్యగానే కాదు.. మల్టీ టాలెంటెడ్ ఉమన్‌‌‌‌గా కూడా ఐశ్వర్య ఫేమస్. ఇరవయ్యేళ్ల క్రితం ప్లేబ్యాక్‌‌‌‌ సింగర్‌‌‌‌‌‌‌‌గా కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె.. తర్వాత ధనుష్‌‌‌‌ హీరోగా నటించిన ‘త్రీ’ చిత్రంతో డైరెక్టర్‌‌‌‌‌‌‌‌గా మారారు. తర్వాత తన తండ్రితో ‘కొచ్చాడయాన్’ అనే త్రీడీ మూవీతో పాటు మరో రెండు సినిమాలు కూడా డైరెక్ట్ చేశారు. అయితే ఐదేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవలే ధనుష్‌‌‌‌తో డివోర్స్ తీసుకోవడంతో ఇప్పుడు మళ్లీ కెరీర్‌‌‌‌‌‌‌‌పై ఫోకస్ పెడుతున్నారు. తాజాగా ఓ మ్యూజికల్ ఆల్బమ్‌‌‌‌ని రూపొందించిన ఐశ్వర్య.. నిన్న తన కొత్త ప్రాజెక్టుని అనౌన్స్ చేశారు. ‘ఓ సాథీ చల్’ అనే లవ్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌తో ఆమె బాలీవుడ్‌‌‌‌లో అడుగు పెడుతున్నారు. మీను అరోరా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిజానికి ఆమె శింబుతోను, లారెన్స్‌‌‌‌తోను సినిమాలు తీయనున్నారంటూ కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. కానీ హిందీ మూవీని అనౌన్స్ చేసి సర్‌‌‌‌‌‌‌‌ప్రైజ్ చేశారు ఐశ్వర్య. డైరెక్టర్‌‌‌‌‌‌‌‌గా తన మార్క్‌‌‌‌ వేయడం కోసం చాన్నాళ్లుగా ఎదురు చూస్తున్నారామె. ఆ కోరిక బాలీవుడ్‌‌‌‌లోనైనా నెరవేరుతుందేమో చూడాలి.