సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) అతిథి పాత్రలో కనిపిస్తున్న లేటెస్ట్ మూవీ లాల్ సలామ్ ( Lal Salaam). తన కూతురు ఐశ్వర్య రజినీకాంత్ (Aishwarya Rajinikanth) డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు.
లాల్ సలామ్ మూవీ రిలీజ్ విషయంలో క్లారిటీ ఇచ్చారు మేకర్స్. గతంలో సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. పలు కారణాలతో వాయిదా పడిన ఈ మూవీ..వచ్చే నెల ఫిబ్రవరి 9న రిలీజ్ కాబోతుందంటూ కొత్త డేట్ను ప్రకటించారు. అంతేకాకుండా రజినీ ఫ్యాన్స్ కొరకు కొత్త రిలీజ్ డేట్తో పాటు వీడియోను పంచుకున్నారు.
ఇందులో మొయిద్దీన్ భాయ్ పాత్రలో రజినీ కనిపించనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఆయన లుక్ సినిమాపై అంచనాలు పెంచింది. ఇపుడు ఏకంగా రజినీ మేనియాను చూపిస్తూ రిలీజ్ చేసిన వీడియో ఆకట్టుకుంటోంది. రజినీ ఫైట్స్ సీన్స్ తో ఉన్న ఈ వీడియో రజినీ స్వాగ్ ఎలా ఉంటుందో చూపించారు. ఐశ్వర్య రజినీకాంత్ దాదాపు 6 ఏళ్ళ తరువాత డైరెక్ట్ చేస్తున్న మూవీ కావడంతో..ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. క్రికెట్ నేపథ్యంలో జరిగిన అల్లర్లతో ఎటువంటి పరిణామాలు చోటుచేసుకున్నాయో లాల్ సలామ్ ద్వారా తెలిపే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటిస్తుండగా అలాగే నటి జీవిత రాజశేఖర్ కూడా లాల్ సలామ్ మూవీతో రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ మూవీకి ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
Make way for MOIDEEN BHAI ?? Witness Thalaivar's charisma ? on the Big Screen soon! ?️✨ Stay tuned for LAL SALAAM ? RELEASE DATE announcement at 5 PM TODAY! ?️ #LalSalaam ? @rajinikanth @ash_rajinikanth @arrahman @TheVishnuVishal @vikranth_offl @LycaProductions #Subaskaran… pic.twitter.com/beqlez37uD
— Lyca Productions (@LycaProductions) January 9, 2024