ఐశ్వర్య రజినీకాంత్ మానవత్వం : డైరెక్టర్స్ అసోసియేషన్కు ఏటా రూ.10 లక్షల విరాళం

ఐశ్వర్య రజినీకాంత్ మానవత్వం : డైరెక్టర్స్ అసోసియేషన్కు ఏటా రూ.10 లక్షల విరాళం

తమిళ చిత్రసీమలో ప్రముఖ చిత్రనిర్మాత, దర్శకురాలు ఐశ్వర్య రజనీకాంత్ (Aishwarya Rajinikanth) ఒకరు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె దర్శకుల సంఘానికి మద్దతు పలికారు.

డైరెక్టర్లు మరియు అసిస్టెంట్ డైరెక్టర్ల పిల్లల విద్యా సహాయం కోసం ఏటా రూ. 10 లక్షలు అందజేస్తానని ఆమె హామీ ఇచ్చారు. తొలి విడతలో భాగంగా ఐశ్వర్య రూ. 5 లక్షలను దర్శకుల సంఘానికి విరాళంగా అందజేసింది. ఈ ఏడాది మిగిలిన రూ. 5 లక్షలు విరాళంగా ఇస్తానని ఆమె హామీ ఇచ్చినట్లు సమాచారం.

ALSO READ | Amala Paul Son: హీరోయిన్ అమలాపాల్ కొడుకు ఎంత క్యూట్‌గా ఉన్నాడో.. చూడండి

ఇందులో భాగంగా ఐశ్వర్య రజనీకాంత్  రూ. 5 లక్షల చెక్కును ఆర్‌కె సెల్వమణి, పేరరాసు, శరణ్ మరియు అసోసియేషన్‌లోని ఇతర సభ్యులకు అందజేసింది. పిల్లల చదువు కోసం ఐశ్వర్య రజినీకాంత్ చూపిన మానవత్వం పట్ల తమిళ సినీ పరిశ్రమ నుంచి ప్రశంసలు అందుతున్నాయి. రజినీ కూతురుగా తనదైన టాలెంట్ తో ఇండస్ట్రీలో రాణిస్తూనే..సామాజిక సేవలు చేస్తుందంటూ తెలుగు తమిళ సినీ ప్రేక్షకుల నుంచి అభినందనలు తెలుపుతున్నారు. 

ఇకపోతే..ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన లాల్ సలామ్ (Lal Salaam) మూవీ ఈ ఏడాది ఫిబ్రవరి 9న థియేటర్లోకి వచ్చి డిజాస్టర్ అయింది. ఈ సినిమాలో విష్ణు విశాల్(Vishnu Vishal), విక్రాంత్(Vikranth) హీరోలుగా నటించారు. ఫస్ట్ షో నుంచే నెగటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలిపోయింది.