ఘనంగా ఏఐటీయూసీ ఆవిర్భావ వేడుకలు

కోల్​బెల్ట్/​నస్పూర్/బజార్ హత్నూర్, వెలుగు: సింగరేణి కార్మికుల హక్కులు, డిమాండ్ల సాధన కోసం ఏఐటీయూసీ యూనియన్​ రాజీలేని పోరాటాలు చేస్తుందని ఆ యూనియన్​ కేంద్ర కమిటీ సెక్రటరీ ఎండీ అక్బర్​అలీ, మందమర్రి బ్రాంచి సెక్రటరీ సలెంద్ర సత్యనారాయణ అన్నారు. మంగళవారం మందమర్రి, రామకృష్ణాపూర్​లో ఏఐటీయూసీ 104వ ఆవిర్భావ వేడుకలను వేర్వేరుగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్​ జెండాను ఆవిష్కరించి కేక్​ కట్ చేశారు. వేడుకల్లో రామకృష్ణాపూర్​ బ్రాంచి సెక్రటరీ ఆంజనేయులు, వైస్​ ప్రెసిడెంట్ ​లింగయ్య, జాయింట్​ సెక్రటరీ కంది శ్రీనివాస్, ఆర్గనైజేషన్ సెక్రటరీ సంపత్, ట్రెజరర్లు, అన్ని గనులు, డిపార్ట్​మెంట్ల పిట్​సెక్రటరీలు పాల్గొన్నారు.

నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో జరిగిన వేడుకల్లో స్థానిక యూనియన్ లీడర్లు జెండా ఆవిష్కరించి మాట్లాడారు. స్వాతంత్రం పూర్వమే 1920లో దేశంలోనే మొట్టమొదటి కార్మిక సంఘంగా ఏఐటీయూసీ ఆవిర్భవించిందని, స్వాతంత్రం కోసం పోరాటం చేసిన ఏకైక కార్మిక సంఘం అని తెలిపారు. లీడర్లు వీరభద్రయ్య, సమ్మయ్య, సారయ్య, నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. బజార్ హత్నూర్ మండల కేంద్రంలోని శివాజీ చౌక్ వద్ద ఏఐటీయూసీ కమిటీ అధ్వర్యంలో మంగళవారం జెండా  ఆవిష్కరించి వేడుకలు నిర్వహించారు. ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి, మండల అధ్యక్షులు కీర్తి వెంకట రమణ, మండల బీఓసీ కార్యదర్శి రవీందర్, ఏఐటీయూసీ కోశాధికారి రాజు, కార్మికులు పాల్గొన్నారు.