కోల్‌బెల్ట్, వెలుగు : సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఓటమి భయంతోనే టీబీజీకేఎస్ ఎన్నికలు వద్దంటోందని ఏఐటీయూసీ బ్రాంచి సెక్రటరీ సలెంద్ర సత్యనారాయణ ఆరోపించారు. గురువారం మందమర్రి ఏరియా సింగరేణి వర్క్‌షాప్‌లో ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. హైకోర్టు తీర్పు మేరకు ఎన్నికలకు ఆర్ఎల్ సీ ఎన్నికల షెడ్యూల్‌విడుదల చేస్తే మళ్లీ అడ్డుకునే కుట్రలు చేస్తున్నారన్నారు.
సింగరేణిలో కొత్త అండర్ గ్రౌండ్ బొగ్గు గనులను తీసుకవస్తామని, లక్ష వరకు కార్మికుల సంఖ్యను పెంచుతామంటూ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మరిచిపోయారని ఎద్దేవా చేశారు. సమావేశంలో యూనియన్బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్భీమనాథుని సుదర్శనం, లీడర్లు పెద్దపల్లి బానయ్య, పారిపెల్లి రాజేశం, రాజమౌళి, సదాశివరెడ్డి తదితరులు పాల్గొన్నారు.