కోల్‌బెల్ట్, వెలుగు: సింగరేణి గుర్తింపు సంఘంగా కొనసాగిన టీబీజీకేఎస్ కార్మికుల సమస్యలను పట్టించుకోలేదని ఏఐటీయూసీ బ్రాంచి సెక్రటరీ సలెంద్ర సత్యనారాయణ ఆరోపించారు. గురువారం మందమర్రి ఏరియా కేకే 5 గనిపై నిర్వహించిన గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గుర్తింపు సంఘం ఎన్నికల్లో చుక్క గుర్తుకు ఓటేసి ఏఐటీయూసీని అదరించాలని కోరారు.
కార్మికులకు సొంతింటి కలను నేరవేర్చుతామని, పెర్క్స్‌పై ఇన్కమ్ ట్యాక్స్‌ను యాజమాన్యమే చెల్లించే విధంగా చూస్తామన్నారు. సింగరేణిలో రాజకీయ జోక్యం, ఆర్థిక దోపిడీ లేకుండా చేస్తామని.. కార్మికుల హక్కులు, డిమాండ్లను సాధించిపెట్టడమే ధ్యేయంగా పనిచేస్తామని పేర్కొన్నారు.
ఏఐటీయూసీ బ్రాంచి వైస్ ప్రెసిడెంట్ భీమనాథుని సుదర్శనం, జాయింట్ సెక్రటరీ కంది శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ గాండ్ల సంపత్, లీడర్లు దేవసాని సాంబయ్య, కొండయ్య, సంపత్, శ్రీనివాస్, మల్లయ్య, జనార్ధన్, వెంకటస్వామి, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.