కామేపల్లి/ములకలపల్లి/పాల్వంచరూరల్, వెలుగు: రాష్ట్రంలో పనిచేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్ రూ.10 లక్షల ఇవ్వాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం ఏఐటీయూసీ అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ఆధ్వర్యంలో పాల్వంచ, కామేపల్లి, ములకలపల్లిలో అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా చేశారు. అధికారులకు వినతి పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా కామేపల్లిలో ఏఐటీయూసీ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి తోట రామాంజనేయులు, పాల్వచంలో అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నరాటి ప్రసాద్, ముకలపల్లిలో నాయకులు నారం సునీత, పసుపులేటి శివలక్ష్మి మాట్లాడారు. అంగన్వాడీ కార్యకర్తలకు రూ.18 వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.