-
ఏఐటీయూసీ ప్రెసిడెంట్ వి.సీతారామయ్య
గోదావరిఖని, వెలుగు : సింగరేణిలో లాభాల్లో కార్మికులకు వాటా ప్రకటనపై వాస్తవాలు తెలుసుకోకుండా బీఆర్ఎస్అనుబంధ టీబీజీకేఎస్తో పాటు మరికొన్ని సంఘాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ప్రెసిడెంట్వి.సీతారామయ్య అన్నారు. గురువారం జీడీకే –1వ గనిపై జరిగిన గేట్మీటింగ్లో ఆయన పాల్గొని మాట్లాడారు. సింగరేణిలో భవిష్యత్ రోజుల్లో స్ట్రక్చర్, జేసీసీ మీటింగ్ లకు క్రమపద్ధతిలో జరిగేలా కృషి చేస్తూ ఎన్నికల ప్రణాళికను అమలు చేసేలా సమస్యలపై పోరాడతామని పేర్కొన్నారు. కార్మికులకు అలవెన్సుల(పెర్క్స్)పై ఇన్కమ్ ట్యాక్స్ సంస్థ చెల్లించేలా, మారు పేర్ల మార్పు, డిపెండెంట్ల విజిలెన్స్ కేసులు, సొంతింటి స్కీమ్ వంటి పలు సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పని చేస్తామని ఆయన తెలిపారు. ఈ మీటింగ్లో లీడర్లు అశోక్, ఎల్లాగౌడ్, స్వామి, పోషం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.