కొత్త బొగ్గు గనులు రాకపోతే .. సింగరేణి మనుగడ కష్టమే

కొత్త బొగ్గు గనులు రాకపోతే .. సింగరేణి మనుగడ కష్టమే
  • ఏఐటీయూసీ ప్రెసిడెంట్​వాసిరెడ్డి సీతారామయ్య
  • బొగ్గు గనుల వేలాన్ని నిరసిస్తూ 5న కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు

కోల్​బెల్ట్​, వెలుగు : సింగరేణి సంస్థకు కొత్త బొగ్గు గనులు రాకపోతే కంపెనీ మనుగడ కష్టమని, ఉద్యోగ భద్రతకు, కొత్త ఉపాధులకు నష్టం వాటిల్లుతుందని సింగరేణి గుర్తింపు సంఘం(ఏఐటీయూసీ) స్టేట్​ ప్రెసిడెంట్​వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. సోమవారం మందమర్రి ఏరియా కాసిపేట-1 గనిపై నిర్వహించిన గేట్​మీటింగ్, మందమర్రిలోని యూనియన్​ఆఫీస్​లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణిలో జరుగుతున్న ప్రైవేటీకరణను సమష్టిగా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.  శ్రావణపల్లి బొగ్గు బ్లాక్​ను వేలం జాబితాలో చేర్చడంతో సింగరేణికి తీవ్ర నష్టం జరుగుతోందన్నారు.

రాష్ట్రంలోని కాంగ్రెస్​సర్కార్..​ కేంద్రం ప్రభుత్వంతో చర్చించి తెలంగాణలోని అన్ని బొగ్గు బ్లాక్​లను సింగరేణి సంస్థకు కేటాయించేలా ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్​చేశారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్​బొగ్గు గనులను వేలం వేయడాన్ని నిరసిస్తూ ఈనెల 5న అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట ఏఐటీయూసీ, సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతామన్నారు.

సమావేశాల్లో ఏఐటీయూసీ సెంట్రల్​సెక్రటరీ ఎండీ అక్బర్ అలీ, మందమర్రి, బెల్లంపల్లి, రామకృష్ణాపూర్​బ్రాంచీల సెక్రటరీలు సలెంద్ర సత్యానారాయణ, దాగం మల్లేశ్, ఎ.ఆంజనేయులు, వైస్​ప్రెసిడెంట్లు భీమనాథుని సుదర్శనం, లింగయ్య, వెంకటస్వామి, అసిస్టెంట్​సెక్రటరీలు, గనుల పిట్, ఏరియా బాధ్యులు పాల్గొన్నారు.