
- సింగరేణి సీఎండీకి ఏఐటీయూసీ వినతి
కోల్‌బెల్ట్, వెలుగు: సింగరేణి సంస్థలో పనిచేస్తున్న ప్రైవేట్ కన్వేయన్స్ డ్రైవర్ల సమస్యలను వెంటనే పరిష్కరించేలా కృషి చేయాలని సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ లీడర్లు సింగరేణి సీఎండీ ఎన్.బలరాం నాయక్‌కు విన్నవించారు. ఏఐటీయూసీ స్టేట్ ప్రెసిడెంట్ వాసిరెడ్డి సీతారామయ్య, జనరల్ సెక్రటరీ కె.రాజ్కుమార్నేతృత్వంలో కాంట్రాక్ట్వర్కర్స్ యూనియన్ లీడర్లు బుధవారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్లో సీఎండీని కలిశారు.
జీవో ప్రకారం డ్రైవర్లకు పూర్తి వేతనాలు చెల్లించాలని కోరారు. సీఎం పీఎఫ్ పెండింగ్డబ్బులను వెంటనే వారి అకౌంట్లో జమచేయాలన్నారు. 8 గంటల పని విధానం అమలు చేయాలని, అదనపు పనిగంటలకు వేతనం చెల్లించాలని తదితర సమస్యలను సీఎండీ దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రం అందజేశారు.
సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని సీఎండీ హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు బుర్ర తిరుపతి గౌడ్, ఎండీ అక్బర్ ఆలీ తదితరులు పాల్గొన్నారు.