కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండంలోని ఎల్ అండ్ టీ కాలనీలో ఉన్న సివిల్ సప్లై గోదాములలో పనిచేసే కార్మికులు 2 రోజులుగా సమ్మె చేస్తున్నారు. హమాలీ, స్వీపర్స్ కార్మికుల నూతన రేట్ల ఒప్పందాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తు్న్నారు. టెంట్ వేసుకుని బైఠాయించి సివిల్ సప్లై హమాలీ కార్మిక సంఘం వర్థిల్లాలి అంటూ నినాదాలు వినిపిస్తున్నారు.
గతంలో పెంచిన కూలీ రేట్ల జీఓను వెంటనే విడుదల చేయాలని కార్మికులు కోరుతున్నారు. హమాలీ, స్వీపర్స్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. రెండు రోజులుగా విధులు బహిష్కరించి కార్మికులు సమ్మె చేస్తున్నారు. తమ సమస్యలను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని చెబుతున్నారు.