![Viral Video: వింత ప్రేమ..అద్భుత కథ.. ప్రియుడిని బాక్సులో పెట్టి తాళం వేసింది](https://static.v6velugu.com/uploads/2024/10/ajab-prem-ki-gazab-kahani-girlfriend-locks-boyfriend-inside-a-box-video-goes-viral_OaFxH5kPV8.jpg)
సోషల్ మీడియా..రకరకాల వింతలు, విశేషాలు ఉంటాయి. వాటిలో కొన్ని చాలా ఎంటర్ టైన్ మెంట్ని అందిస్తాయి. మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. కొన్ని మనం చూస్తున్నవి నమ్మలేనివి గా కూడా ఉంటాయి. ఇలాంటి ఎలా జరుగుతాయో నని ఆశ్చర్యపోతుంటాం. అలాంటి ఓ జంటకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రహస్యంగా బాయ్ ఫ్రెండ్ తో సమావేశం అయిన బాలిక.. తల్లిదండ్రుల రాకతో భయంతో బాయ్ ఫ్రెండ్ ని పెట్టెలో పెట్టి తాళం వేసింది. ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లను ఆశ్చర్యపర్చడమే కాకుండా ఎంటర్ టైన్ మెంట్ అందించింది.
ఎక్కడ జరిగిందో స్పష్టంగా తెలియదు గానీ ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతున్న బాలిక.. సడెన్ గా తల్లిదండ్రులు రావడంతో షాక్ తిని.. ఏం చేయాలో తెలియక బాయ్ ఫ్రెండ్ ని సూట్ కేస్ లో పెట్టి లాక్ చేసింది.
प्रेमिका ने प्रेमी को बक्से मे किया बंद...l pic.twitter.com/q3zm9YY0cG
— Viral Vibes (@Viralvibes07) October 17, 2024
Also Read :- శ్రీశైలం ప్రాజెక్టుకు జలకళ..ఐదోసారి క్రస్ట్ గేట్లు ఓపెన్
గదిలో బట్టలు, సామాన్లు చెల్లాచెదురుగా ఉండటం..పెట్టెకు తాళం వేసి ఉండటాన్ని గమనించిన కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. సూట్‌కేస్‌ని తెరవమని అమ్మాయిని ఆదేశించారు. ఈ దృశ్యాలను ఓ యువకుడు చిత్రీకరించాడు.
ఈ వీడియో X హ్యాండిల్ @Viralvibes07 ద్వారా పోస్ట్ చేశారు.8వేల మంది చూశారు. వందల కొద్దీ లైక్‌లు వచ్చాయి. ఈ వైరల్ వీడియోను చూసిన తర్వాత నెటిజన్లు సెటైర్లతో స్పందించారు.
కొందరు యువకుడి సూట్ కేసులో ఎలా ఉండగలిగాడు అని అనుమానం వ్యక్తం చేశారు. ఇంకో నెటిజన్ స్పందిస్తూ.. ఇంకో రెండు నిమిషాలు ఉండి ఉంటే శవంగా బయటికి వచ్చేవాడు అని హాస్యంగా రాశారు. ఇలాంటి ఐడియాలు వీళ్లకు ఎలా వస్తాయబ్బా మరో నెటిజన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.