న్యూఢిల్లీ: కేదారా క్యాపిటల్ పెట్టుబడులు ఉన్న కాంక్రీట్ పరికరాల తయారీదారు అజాక్స్ ఇంజనీరింగ్ ఐపీఓ ఈ నెల 10–12 వరకు ఉంటుంది. ఇష్యూతో ఇది రూ.1,269 కోట్లు సేకరిస్తుంది. ధరలను ఒక్కో షేరుకు రూ.599 నుంచి రూ.629 మధ్య నిర్ణయించినట్లు తెలిపింది.
బెంగళూరు నుంచి పనిచేసే ఈ కంపెనీ యాంకర్ ఇన్వెస్టర్ల బిడ్డింగ్ ఫిబ్రవరి ఈ నెల ఏడో తేదీన నిర్వహిస్తుంది. ఈ ఐపీఓలో ఫ్రెష్ ఇష్యూ ఉండదు. ఆఫర్- ఫర్- సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా 2.1 కోట్ల ఈక్విటీ షేర్లను అమ్ముతారు. ఓఎఫ్ఎస్లో భాగంగా, కేదారా క్యాపిటల్ 74.37 లక్షల షేర్లను అమ్ముతుంది. పబ్లిక్ ఇష్యూ పూర్తిగా ఓఎఫ్ఎస్ అయినందున, అజాక్స్ ఇంజనీరింగ్‌కు ఈ ఐపీఓ నుంచి ఆదాయం రాదు.