ఆర్మూర్, వెలుగు : ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను కారు పంక్చర్ కావడం, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ పేర్కొన్నారు. బుధవారం ఆర్మూర్ మండలం అంకాపూర్ లో బీజేపీ అభ్యర్థి పైడి రాకేశ్రెడ్డి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రధాని మోదీ అభివృద్ధిని చూసి ప్రపంచ దేశాలే పొగుడుతుంటే.. మోదీ హటావో అంటూ ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయన్నారు.
Also Read :- గజ్వేల్‌లో నామినేషన్ వేసిన సీఎం కేసీఆర్
ప్రతిపక్షాలు దేశం గురించి ఆలోచించకుండా, తమ కుటుంబ సభ్యుల గురించి మాత్రమే ఆలోచించి పరిపాలన చేస్తున్నాయన్నారు. లిక్కర్ స్కాం కేసులో సీఎం కూతురు కవిత పై సీబీఐ,ఈడీ విచారణ జరుగుతుందని, తప్పు చేసినట్లు రుజువయితే కచ్చితంగా చర్య తీసుకుంటారన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, బీజేపీ ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి అల్జాపూర్ శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ కంచెట్టి గంగాధర్ పాల్గొన్నారు.