కార్తి హీరోగా, లోకేష్ కనగరాజ్ రూపొందించిన ‘ఖైదీ’ కోలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా హిందీ రీమేక్ రైట్స్ తీసుకుని అందులో తానే స్వయంగా నటిస్తున్నట్టు రెండేళ్ల క్రితమే అనౌన్స్ చేశాడు అజయ్ దేవగన్. కానీ కరోనా ఎఫెక్ట్‌తో అజయ్ ఇతర చిత్రాల షూటింగ్స్ ఆలస్యమై దీన్ని ఇప్పటివరకు పట్టాలెక్కించలేదు. ఇప్పుడు ఆ టైమ్ వచ్చినట్టు తెలుస్తోంది. ఈ మూవీ గురించి అప్‌డేట్ ఒకటి బీటౌన్‌లో వైరల్ అవుతోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్‌ని మరో వారంలో స్టార్ట్ చేయనున్నారట. అజయ్ శర్మ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాని రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తోంది. ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలను త్వరలో రివీల్ చేయనున్నారు. మరోవైపు, రన్‌వే 34, మైదాన్, థ్యాంక్ గాడ్ వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నాడు అజయ్ దేవగన్ . ఇక ఖైదీతో పాటు రైడ్2, సింగం3 ప్రాజెక్టులు ఈయేడు లైన్‌లో ఉన్నాయి.