SinghamAgainTrailer: సింగం ఎగైన్ ట్రైలర్ రిలీజ్.. అజయ్‌ దేవగన్- అక్షయ్ కుమార్ యాక్షన్ ప్యాక్డ్ అదిరింది

 SinghamAgainTrailer: సింగం ఎగైన్ ట్రైలర్ రిలీజ్.. అజయ్‌ దేవగన్- అక్షయ్ కుమార్ యాక్షన్ ప్యాక్డ్ అదిరింది

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి (Rohit shetty) డైరెక్షన్ లో వస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ సింగం ఎగైన్ (Singham again). అజయ్‌ దేవగన్ (Ajay Devgan),అక్షయ్ కుమార్ (Akshay kumar), రణ్‌వీర్ సింగ్(Ranveer singh) ప్రధాన పాత్రలో వస్తున్న ఈ సినిమాలో స్టార్ బ్యూటీ దీపికా పదుకొనె(Deepika padukone) హీరోయిన్ గా నటిస్తోంది.

తాజాగా సింగం ఎగైన్ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పవర్-ప్యాక్డ్ కాప్ డ్రామాలో అజయ్ దేవగన్ బాజీరావ్ సింగమ్‌గా తన ఐకానిక్ పాత్రను తిరిగి పోషించాడు. మరోసారి తన విశ్వరూపం చూపించేసాడు. తమ డైలాగ్‌లతో, యాక్షన్ మూమెంట్స్ తో  అజయ్‌ దేవగన్, అక్షయ్ కుమార్ అదరగొట్టేసారు.

ప్రాణాంతకమైన విషపూరితమైన వైద్య వ్యర్థాలను రవాణా చేసే క్రైమ్ కార్పొరేషన్‌తో పోరాడే.. సిన్సీయర్ పోలీసు అధికారిగా అజయ్ నటించగా.. లేడీ పోలీస్‌ ఆఫీసర్‌గా దీపికా కనిపించింది. దాదాపు 4.58 నిమిషాల నిడివితో ఉన్న ఈ ట్రైలర్‌ రోహిత్‌ మార్క్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌లతో ఆక్టటుకునేలా సాగింది.

ఇకపోతే సింగం అగైన్ మూవీలో కరీనా కపూర్,రణ్‍వీర్ సింగ్ కూడా క్యామియో రోల్స్‌లో కనిపించనున్నారు. దీపికా పదుకొణ్, టైగార్ ష్రాఫ్, అర్జున్ కపూర్, జాకీ ష్రాఫ్, దయానంద్ శెట్టి, శ్వేతా తివారీ కీలకపాత్రలు పోషించారు. అయితే ఈ సినిమాను ముందుగా ఆగస్టు 15న విడుదల చేయాలనీ అనుకున్నారట మేకర్స్. కానీ, షూటింగ్ ఆలస్యమవటంతో దీపావళి సందర్బంగా నవంబర్‌ 1న విడుదలకానుంది.

  • Beta
Beta feature
  • Beta
Beta feature