Ajay Devgn Shaitan: ఫ‌స్ట్ డే కలెక్షన్స్తో కుమ్మేసిన సైతాన్..హార‌ర్ మూవీస్లో నంబ‌ర్ వ‌న్ ఇదే

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ (Ajay Devgn), మాధవన్ (Madhavan), జ్యోతిక (Jyotika) లీడ్‌‌ రోల్స్‌‌లో నటిస్తున్న చిత్రం సైతాన్‌ (Shaitaan)‌. క్వీన్, సూపర్ 30, గుడ్ బై లాంటి చిత్రాలను తీసిన వికాస్ బహెల్ ఈ సినిమాని తెరకెక్కించాడు. సూపర్ నేచురల్ థ్రిల్లర్ కథాంశంతో నిన్న (మార్చి 8న) థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాపీస్ వద్ద దూసుకెళ్తోంది. బాలీవుడ్ సినీ చ‌రిత్ర‌లో ఫస్ట్ డే అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన హార‌ర్ మూవీగా సైతాన్ రికార్డ్ క్రియేట్ చేసింది.

సైతాన్ మూవీ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా రూ.14.50 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. గ‌తంలో బాలీవుడ్‌లో హారర్ సినిమాల్లో అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ చేసిన మూవీగా ఇమ్రాన్ హ‌ష్మీ నటించిన రాజ్ 3 పేరిట నెలకొన్న రికార్డ్ ను సైతాన్ ఇప్పుడు బ్రేక్ చేసింది.

2012లో రిలీజైన రాజ్ 3 మూవీ బాక్సాపీస్ వద్ద రూ.10.33 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఇప్పుడు లేటెస్ట్గా 12 ఏళ్ల రికార్డును సైతాన్ బ‌ద్ద‌లు కొట్టింది. ప్రస్తుతం శని, ఆదివారాల్లో వీకెండ్ ఆడియన్స్ ఈ హారర్ మూవీని చూడటానికి..చాలా ఇంట్రెస్ట్ చూపుతున్నారు.దీంతో సైతాన్ భారీగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టే అవ‌కాశం ఉన్న‌ట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఫ‌స్ట్ వీకెండ్‌ కంప్లీట్ అయ్యేలోపు యాభై కోట్ల క‌లెక్ష‌న్స్ దాటే అవకాశం ఉంది. 

గత ఏడాది ఫిబ్రవరిలో విడుదలై సక్సెస్‌‌ సాధించిన ‘వశ్‌‌’ అనే గుజరాతీ సినిమాకు సైతాన్‌‌ రీమేక్ గా తెరకెక్కింది. ఇక ఒరిజినల్ మూవీలో ఇంపార్టెంట్ రోల్ చేసిన గుజరాతీ నటి జాంకీ బోడివాలా, హిందీలోనూ నటిస్తోంది. ఇక పాతికేళ్ల తర్వాత ఈ సినిమాతో తిరిగి బాలీవుడ్‌‌లో రీ ఎంట్రీ ఇస్తోంది జ్యోతిక. అజయ్ దేవగన్‌‌కు జంటగా ఆమె నటిస్తోంది. జియో స్టూడియోస్‌‌ సమర్పణలో అజయ్ దేవగన్‌‌, జ్యోతి దేశ్‌‌పాండే, అభిషేక్ పాఠక్ ఈ సినిమాని నిర్మించారు. 

సైతాన్ క‌థ:

క‌బీర్ (అజ‌య్ దేవ్‌గ‌ణ్‌), జ్యోతి(జ్యోతిక‌) త‌మ కూతురు జాన్వీతో క‌లిసి వెకేషన్ కోసం ఓ మారుమూల గ్రామానికి వెళ‌తారు.ఓ అపరిచిత వ్యక్తి ఆప్తుడిగా క‌బీర్‌కు ప‌రిచ‌యం అవుతాడు వ‌న్‌రాజ్ (మాధ‌వ‌న్‌). ఇక అతని కారణంగా క‌బీర్ ఫ్యామిలీ చిక్కుల్లో ప‌డుతుంది. త‌న మాయ‌లు, మంత్రాల‌తో క‌బీర్ ఫ్యామిలీని వ‌న్‌రాజ్ ఎలాంటి ఇబ్బందులు పెట్టాడు? థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌తో ఆడియాన్స్లో ఇంట్రెస్ట్ పెంచుతోంది ఈ సినిమా. 

ALSO READ :- రూ. 2వేల కోట్ల డ్రగ్స్ కేసులో తమిళ నిర్మాత అరెస్ట్..

మాధ‌వ‌న్ ఒక సైతాన్ గా మారి అజయ్ దేవ‌గ‌న్ కుమార్తెను వ‌శ‌ప‌రుచుకుంటాడు. యువ‌తిపై వ‌శీక‌ర‌ణ మంత్రాన్ని ప్ర‌యోగిస్తాడు. అనూహ్యంగా ఆ యువ‌తి ఇంట్లోనే అత‌డు సాగించే భ‌యాన‌క‌మైన ఆట ఏంటనేది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే