తెలుగు, తమిళ భాషల్లో సూర్యకు ‘సింగం’ సిరీస్ ఎంతటి విజయాలను ఇచ్చిందో.. హిందీ ‘సింగం’ సిరీస్ అజయ్ దేవగన్‌కు అంతే సక్సెస్‌ను ఇచ్చింది. ఇప్పటికే ఈ ఫ్రాంచైజీలో సింగం, సింగం రిటర్న్స్ చిత్రాలు తీసి అజయ్‌కు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు రోహిత్ శెట్టి.. ఇప్పుడు అతనితో మూడో సినిమా చేయబోతున్నాడు. ‘సింగం ఎగైన్’ టైటిల్‌తో రూపొందబోయే ఈ మూవీ గురించి ఆదివారం షూటింగ్ మొదలు రిలీజ్ డేట్ వరకూ క్లారిటీ ఇచ్చారు.
ఈ ఏడాది ఆగస్టులో షూటింగ్ ప్రారంభించబోతున్నారు. అలాగే వచ్చే ఏడాది ఆగస్టు 15న రిలీజ్ కానుంది. ‘సూర్యవన్షీ’ మూవీ క్లైమాక్స్‌లో ఓ టెర్రరిస్ట్ కోసం ‘భాజీరావు సింగం’ పాకిస్తాన్ వెళ్తున్నట్లు చూపించి ‘సింగం ఎగైన్’కి లీడ్ ఇచ్చాడు రోహిత్ శెట్టి. దీంతో పాకిస్తాన్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ఉండబోతున్నట్టు తెలుస్తోంది.