Maidaan OTT: OTTకి వచ్చిన ఎమోషనల్ స్పోర్ట్స్ బయోపిక్.. ఫ్రీగా చూసేయండి

Maidaan OTT: OTTకి వచ్చిన ఎమోషనల్ స్పోర్ట్స్ బయోపిక్.. ఫ్రీగా చూసేయండి

బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్(Ajay devgun) రిలీజ్ చేసిన లేటెస్ట్ మూవీ మైదాన్(Maidaan). హైదరాబాద్‌ కు చెందిన ప్రముఖ ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా వచ్చిన ఈ సినిమాను అమిత్ శర్మ తెరకెక్కించగా.. జీ స్టూడియోస్, వైకోమ్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించారు. దాదాపు నాలుగేళ్లుగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా రంజాన్ పండుగ సందర్భంగా ఏప్రిల్ 10న థియేటర్లలోకి వచ్చింది.

ఎమోషనల్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి హిట్ టాక్ వచ్చినప్పటికీ అనుకున్న స్థాయిలో కలెక్షన్స్ రాలేదు. దాంతో నిర్మాతలకు భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. దాంతో.. అనుకున్నదానికన్నా ముందుగానే ఓటీటీకి వచ్చేసింది. అయితే..   కొన్నిరోజుల క్రితం అమెజాన్ ప్రైమ్ లో రెంట్ విధానంలో స్ట్రీమింగ్ అయిన ఈ సినిమా.. ఇప్పుడు ఫ్రీగా స్ట్రీమ్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా చూసేయండి.

ఇక మైదాన్ సినిమా కథ విషయానికొస్తే.. 1952 హెల్సింకీ ఒలింపిక్స్‌లో భారత ఫుట్‌బాల్ జట్టు ఘోర ప్రదర్శన చేస్తుంది. ఆటగాళ్లకు సరైన సదుపాయలు కూడా ఉండకపోవడంతో వాళ్ళు సరిగా ఆడలేకపోతారు. దీంతో జట్టుకి కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ (అజయ్ దేవగణ్) ఆటగాళ్లకు అండగా నిలబడతాడు. గతంలో చేసిన తప్పులు తెలుసుకుని.. అవి రిపీట్ అవకుండా టీమ్‌ని మళ్లీ రెడీ చేస్తాడు. మరి తర్వాత జరిగిన టోర్నీల్లో జట్టు ఎలాంటి ప్రదర్శన ఇచ్చింది? అందుకోసం కోచ్ సయ్యద్, ఆటగాళ్లకు ఎదురైన సవాళ్లు ఏంటి? వాటిని వాళ్లు ఎలా ఎదుర్కొన్నారు? అనేది మిగతా కథ.