ఇలాంటి ఐడియాలు పాకిస్తాన్‌కి రావే: ఆఫ్ఘన్ జట్టు మెంటార్‌గా భారత మాజీ కెప్టెన్

ఐసీసీ వరల్డ్ కప్ కి ఆఫ్ఘానిస్తాన్ టీం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో జరగనున్న ICC వన్డే ప్రపంచకప్‌కు టీమ్ మెంటార్‌గా భారత మాజీ కెప్టెన్ అజయ్ జడేజాను ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) నియమించింది. 2019 లో 9 మ్యాచులాడిన ఆఫ్ఘనిస్తాన్ ఒక్క మ్యాచ్ లో కూడా విజయం దక్కలేదు. 2015 లో ఒక్క మ్యాచ్ మాత్రం స్కాట్లాండ్ పై ఒక్క విజయాన్ని మాత్రమే నమోదు చేసింది. అయితే ఈ సారి భారత్ లో వరల్డ్ కప్ జరుగుతుండడంతో ఇక్కడి స్పిన్ పిచ్ ల మీద ఆఫ్ఘానిస్తాన్ టీంని తక్కువగా అంచనా వేస్తే అసలుకే ప్రమాదం వస్తుంది.
 
జడేజాతో విజయాలు దక్కేనా..?

అజయ్ జడేజాకి భారత పిచ్ ల మీద మంచి అవగాహన ఉంది. ఐపీఎల్ లో పని చేసిన అనుభవం కూడా ఉంది. అసలే నాణ్యమైన స్పిన్నర్లున్న ఆఫ్ఘానిస్తాన్ టీంకి జడేజా లాంటి మెంటార్ తోడడవడం ఆ జట్టుకి కలిసి వచ్చే అంశమే. మరి ఈ భారత మాజీ కెప్టెన్ సలహాలు, సూచనలతో ఆఫ్ఘన్ జట్టు విజయాల బాట పడుతుందేమో చూడాలి.  ఇదిలా ఉండగా.. మరోవైపు పాకిస్థాన్ జట్టుకి ఇలాంటి ఐడియాలు రావే అని నెటిజన్స్ సెటైర్స్ వేస్తున్నారు. అక్టోబర్ 7న ధర్మశాలలోని HPCA స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది.

జడేజా గణాంకాలు  

జడేజా 1992 నుండి 2000 వరకు భారతదేశం తరపున 15 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. 26.18 సగటుతో 576 పరుగులు చేయగా.. 4 అర్ధ సెంచరీలు అతని ఖాతాలో ఉన్నాయి. అత్యుత్తమ స్కోర్ 96 హెగా ఉంది.  ఇక 196 వన్డేల్లో 37.47 సగటుతో 5359 పరుగులు చేశాడు. వన్డేల్లో అతని పేరు మీద 6 సెంచరీలు మరియు 30 అర్ధసెంచరీలు ఉన్నాయి.  

ఆఫ్ఘనిస్తాన్ ప్రపంచకప్ జట్టు:

హష్మతుల్లా షాహిదీ (సి), రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రియాజ్ హసన్, రహ్మత్ షా, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, ఇక్రమ్ అలీఖిల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, ముజీబ్, రహ్మద్ రహ్మద్, ఎఫ్. ., నవీన్-ఉల్-హక్.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by CricTracker (@crictracker)

<