మహబూబాబాద్‌లో కమీషన్లకు ఆశపడి రోడ్డు నిర్మాణం : అజయ్​సారథి రెడ్డి

మహబూబాబాద్ అర్భన్​, వెలుగు: కమీషన్లకు ఆశ పడి అక్రమంగా రోడ్డు వేశారని సీపీఐ మున్సిపల్​ ఫ్లోర్ లీడర్ అజయ్​సారథి రెడ్డి ఆరోపించారు. గురువారం నిజాం చెరువులో వేసిన రోడ్డును సీపీఐ బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా  మాట్లాడుతూ  రోడ్డు, బతుకమ్మ ఘాట్ నిర్మించేందుకు నిధులు దుర్వినియోగం చేశారన్నారు.

విచారణ జరిపి అధికారులు, ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. ప్రజల సౌకర్యం కోసం  కేబుల్​ బ్రిడ్జి నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు.  కార్యక్రమంలో  పెరుగు కుమార్, నవీన్, శ్రావన్, ప్రవీన్, వికాస్​ తదితరులు ఉన్నారు.