KKR vs GT: ఐపీఎల్‌లో రహానే అరుదైన రికార్డ్: టెస్ట్ ప్లేయర్ అనుకుంటే విధ్వంసకర ఆటగాళ్ల సరసన

KKR vs GT: ఐపీఎల్‌లో రహానే అరుదైన రికార్డ్: టెస్ట్ ప్లేయర్ అనుకుంటే విధ్వంసకర ఆటగాళ్ల సరసన

కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే  ఐపీఎల్ లో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో 500 ఫోర్లు కొట్టిన  అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా సోమవారం (ఏప్రిల్ 21) గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో రహానే ఈ ఘనత అందుకున్నాడు. ఈ మ్యాచ్ ముందు వరకు 497 బౌండరీలు బాదిన ఈ కేకేఆర్ కెప్టెన్.. ఈ మ్యాచ్ లో ఇషాంత్ శర్మ బౌలింగ్ లో ఫోర్ 500 ఫోర్లను పూర్తి చేసుకున్నాడు.  

ఐపీఎల్ చరిత్రలో 500 ఫోర్లు కొట్టిన ఆరో బ్యాటర్ గా నిలిచాడు. రహానే కంటే ముందు ఈ లిస్ట్ లో శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ , డేవిడ్ వార్నర్, రోహిత్ శర్మ, సురేష్ రైనా ఉన్నారు. రహానే ఐపీఎల్ కెరీర్ లో ప్రస్తుతం 502 బౌండరీలు ఉన్నాయి. మరో ఐదు ఫోర్లు కొడితే సురేష్ రైనాను అధిగమించి టాప్ 5 లోకి చేరతాడు. ప్రస్తుతం 768 ఫోర్లతో శిఖర్ ధావన్ అగ్ర స్థానంలో ఉన్నాడు. ఈ మ్యాచ్ లో రహానే మొత్తం 5 ఫోర్లు, ఒక సిక్సర్ తో 36 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రహానే ఒక్కడే పోరాడినా అతనికి సహకరించకపోయేవారు ఎవరూ లేకపోయేసరికి కోల్‌కతా ఈ మ్యాచ్ లో ఓడిపోయింది.

ఐపీఎల్‌లో అత్యధిక ఫోర్లు

768 - శిఖర్ ధావన్ (DC/Deccan/MI/PBKS/SRH) 221 ఇన్నింగ్స్‌లో
732 - విరాట్ కోహ్లీ (RCB) 252 ఇన్నింగ్స్‌లలో
663 - డేవిడ్ వార్నర్ (DC/SRH) 184 ఇన్నింగ్స్‌లలో
609 - రోహిత్ శర్మ (డెక్కన్/MI) 259 ఇన్నింగ్స్‌లలో
506 - సురేష్ రైనా (CSK/GL) 200 ఇన్నింగ్స్‌లలో
502 - అజింక్య రహానె (KKR/RPS/RR/CSK/MI/DC) 179 ఇన్నింగ్స్‌లలో

సోమవారం (ఏప్రిల్ 21) జరిగిన ఈ మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ పై గుజరాత్ టైటాన్స్ 39 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ లో అదరగొట్టిన గిల్ సేన.. తర్వాత బౌలింగ్ లో సమిష్టిగా రాణించి ఈ సీజన్ లో ఆరో విక్టరీ కొట్టింది. టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ చేసిన గుజరాత్.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో కోల్‌కతా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి  159 పరుగులు మాత్రమే చేయగలిగింది.