21న అపెక్స్‌‌ కౌన్సిల్‌‌ మీటింగ్‌‌లో నిర్ణయం తీసుకోనున్న బీసీసీఐ

21న అపెక్స్‌‌ కౌన్సిల్‌‌ మీటింగ్‌‌లో నిర్ణయం తీసుకోనున్న బీసీసీఐ

న్యూఢిల్లీ: ఇండియా టీమ్‌‌కు దూరమైన టెస్టు స్పెషలిస్టులు అజింక్యా రహానె, ఇషాంత్‌‌ శర్మ  బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌‌లు కోల్పోయే అవకాశం కనిపిస్తోంది. శుభ్‌‌మన్‌‌ గిల్‌‌, సూర్యకుమార్‌‌ యాదవ్‌‌కు ప్రమోషన్‌‌ లభించనుంది.   ప్రస్తుతం గ్రూప్‌‌–-సిలో ఉన్న  గిల్‌‌, సూర్యతో పాటు హార్దిక్‌‌ పాండ్యాకు గ్రూప్‌‌-–బికి ప్రమోషన్‌‌ లభించే చాన్సుంది.  ఈ మేరకు  ఈనెల 21వ తేదీన జరిగే అపెక్స్‌‌ కౌన్సిల్‌‌ మీటింగ్‌‌లో2022-–2023 సీజన్‌‌ సెంట్రల్‌‌ కాంట్రాక్టులను బీసీసీఐ ఖరారు చేయనుంది. రహానె, ఇషాంత్‌‌తోపాటు కీపర్‌‌ సాహా ను కూడా కాంట్రాక్టు నుంచి తొలగించడం లాంఛనమే కానుంది.  

వీడియో కాన్ఫరెన్స్‌‌ ద్వారా జరిగే ఈ మీటింగ్‌‌ ఎజెండాలో 12 అంశాలు ఉన్నాయి. ఎజెండాలో లేకపోయినప్పటికీ ఇటీవల టీ20 వరల్డ్‌‌కప్‌‌తో పాటు బంగ్లాదేశ్‌‌తో వన్డే సిరీస్‌‌లో ఓటమిపై బోర్డు పెద్దలు రివ్యూ చేసే అవకాశం ఉంది. ఇక, వాన వల్ల ఎఫెక్ట్‌‌  అయ్యే మ్యాచ్‌‌ల్లో రిజల్ట్‌‌ కోసం  డొమెస్టిక్‌‌ క్రికెట్‌‌లో పదేళ్లకు పైగా ఉపయోగిస్తున్న వీజేడీని కనిపెట్టిన వి. జయదేవన్‌‌కు వన్‌‌ టైమ్‌‌ పేమెంట్‌‌తో పాటు టీమ్​ జెర్సీ స్పాన్సర్లపై బోర్డు చర్చించనుంది.