IPL 2025: 5 మ్యాచ్‌ల్లో నాలుగు హాఫ్ సెంచరీలు.. రహానేకు కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్సీ

IPL 2025: 5 మ్యాచ్‌ల్లో నాలుగు హాఫ్ సెంచరీలు.. రహానేకు కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్సీ

టీమిండియా వెటరన్ ప్లేయర్ అజింక్య రహానే వయసు పెరుగుతున్నా.. భారత జట్టులో స్థానం దక్కపోయినా పరుగులు చేయాలనే కసి ఇంకా అలాగే ఉంది. ప్రస్తుతం దేశవాళీ క్రికెట్ లో టీ20 ఫార్మాట్ లో జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అదరగొడుతున్నాడు. నిలకడగా పరుగులు చేయడంతో పాటు 150 కి పైగా స్ట్రైక్ రేట్ తో దుమ్ము రేపుతున్నాడు. చివరి 5 మ్యాచ్ ల్లో 4 హాఫ్ సెంచరీలు చేసి సూపర్ ఫామ్ లో ఉన్నాడు. బుధవారం (డిసెంబర్ 11) విదర్భతో జరిగిన మ్యాచ్ లో 84 పరుగులు చేసి సత్తా చాటాడు. 

అనుభవం కొన్ని రోజుల క్రితం కేకేఆర్ కెప్టెన్సీ బాధ్యతలు రహానేకు అప్పగించాలనే యాజమాన్యంలో ఆ ఫ్రాంచైజీ ఉన్నట్టు వార్తలు వచ్చాయి. దాదాపు కోల్ కతా పగ్గాలు రహానేకు ఇవ్వనుండడం ఖాయం  ప్రచారం గట్టిగా సాగింది. అయితే ప్రస్తుతం రహానే ఉన్న ఫామ్ ను చూస్తుంటే అతనికే కేకేఆర్ బాధ్యతలు అప్పజెప్పడం ఖాయంగా కనిపిస్తుంది. రహానే గతంలో రాజస్థాన్ రాయల్స్, పూణే జట్లకు కెప్టెన్ గా ఉన్నాడు. భారత టెస్ట్ వైస్ కెప్టెన్ గా ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ గెలిపించిన ఘనత అతని సొంతం.

ALSO READ | SMAT 2024: ఇది కదా మ్యాచ్ అంటే: ముస్తాక్ అలీ ట్రోఫీ సెమీస్‌లో పాండ్యతో సూర్య ఢీ

కెప్టెన్సీ అనుభవంతో పాటు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే రహానేకు కెప్టెన్సీ ఇచ్చినా ఆశ్చర్యం లేదు. రహానే మొదట ఐపీఎల్ మెగా ఆక్షన్ లో మొదట ఎవరూ కొనలేదు. అయితే తర్వాత రౌండ్ లో రూ. 1.5 కోట్ల రూపాయల కనీస ధరకు  అతడిని కేకేఆర్ దక్కించుకుంది. రహానే కెప్టెన్సీ రేస్ లోకి రావడంతో వెంకటేష్ అయ్యర్ కు నిరాశే మిగిలింది. వేలంలో వెంకటేష్ అయ్యర్ ను కోల్ కతా జట్టు రూ.23.75 కోట్లకు దక్కించుకుంది. కెప్టెన్సీ కోసమే అతన్ని అంత భారీ మొత్తంలో వెచ్చించారనే వార్తలు వచ్చాయి.

గత సీజన్ లో కేకేఆర్ జట్టును నడిపించిన శ్రేయాస్ అయ్యర్ ఆ ఫ్రాంచైజీతో తెగదెంపులు చేసుకొని పంజాబ్ కింగ్స్ జట్టులో చేరాడు. అయ్యర్ రూ. 26.75 కోట్ల భారీ బిడ్‌ను వెచ్చించి పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకోగా అతని స్థానంలో కెప్టెన్సీ ఎవరికీ దక్కుతుందో అనే చర్చ మొదలైంది. వస్తున్న నివేదికల ప్రకారం టీమిండియా ప్లేయర్.. మాజీ ఐపీఎల్ కెప్టెన్ అజింక్య రహానేను కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్ గా నియమించనున్నట్టు తెలుస్తుంది.