టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాటర్ అజింక్య రహానే పట్ల భారత సెలెక్టర్లు సుముఖత చూపకపోవడంతో.. ఈ రైట్ హ్యాండర్ మరో మార్గాన్ని ఎంచుకున్నారు. ఇంగ్లాండ్ కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో లీసెస్టర్‌షైర్ తరఫున ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. లీసెస్టర్‌షైర్ తరఫున వన్-డే కప్ ప్రచారంతో పాటు ఐదు కౌంటీ మ్యాచ్‌ల్లో భారత బ్యాటర్ భాగం కానున్నాడు.
గతేడాది రహానే కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ఆడేందుకు లీసెస్టర్‌షైర్ జట్టుతో ఒప్పందం చేసుకున్నప్పటికీ.. ఆ బాధ్యతలను నెరవేర్చలేకపోయాడు. ఆస్ట్రేలియాతో 2023 ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఉండటంతో సెలక్టర్లు అతనికి మరో అవకాశమిచ్చారు. ఫైనల్లో రహానే బ్యాట్‌తో మంచి ఆటతీరు కనపరిచాడు. దాంతో, వెస్టిండీస్ పర్యటన కోసం ఎంపికయ్యాడు. ఆ సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు ఆడిన రహానే సరిగ్గా రాణించకపోవడంతో జట్టు నుండి తొలగించబడ్డాడు. ఆ తర్వాత భారత్ తరఫున ఏ ఒక్క మ్యాచ్‌లోనూ ఆడలేదు.
జాతీయ జట్టుకు దూరమైన రహానే.. దేశవాళీ క్రికెట్‌లో రెగ్యులర్‌గా ఆడుతున్నాడు. ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్ ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో 45.76 సగటుతో 13,000కిపైగా పరుగులు చేశాడు. లిస్ట్ ఏ క్రికెట్‌లో 39.72 సగటుతో 6475 పరుగులు చేశాడు. అతని అనుభవం లీసెస్టర్‌షైర్‌కు ఉపయోగపడుతుందని ఆ జట్టు డైరెక్టర్ క్లాడ్ హెండర్సన్ ధీమా వ్యక్తం చేశారు.
Ajinkya Rahane signs for Leicestershire for the One-Day Cup and the last five matches of the County Championship season.
— ESPNcricinfo (@ESPNcricinfo) June 27, 2024
He had withdrawn from a planned stint last summer after earning a recall to India's Test team 👉 https://t.co/HkZfuQopM6 pic.twitter.com/V1USkjNAuR