Ajinkya Rahane: ఫైనల్లో బాగా ఆడినా తప్పించడం బాధించింది.. సెలక్టర్లపై రహానే విమర్శలు

Ajinkya Rahane: ఫైనల్లో బాగా ఆడినా తప్పించడం బాధించింది.. సెలక్టర్లపై రహానే విమర్శలు

టీమిండియా వెటరన్ క్రికెటర్ అజింక్య రహానే భారత టెస్ట్ జట్టుకలో స్థానం కోల్పోయి దాదాపు 18 నెలలు అవుతుంది. బాగా ఆడుతున్నా సెలక్టర్లు మాత్రం యంగ్ ప్లేయర్లకే ఓటేశారు. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా లాంటి కఠిన పర్యటనలకు కూడా రహానేకు పరిగణించలేదు. దీంతో అప్పటి నుంచి రహానే ప్రతిష్టాత్మకమైన దేశవాళీ క్రికెట్ రంజీ ట్రోఫీ ఆడుతూ సత్తా చాటుతున్నాడు. ఓ వైపు ప్లేయర్ గా.. మరోవైపు కెప్టెన్ గా ముంబై ఇండియన్స్ ను ముందుండి నడిపిస్తున్నాడు. ఇటీవలే హర్యానాతో జరిగిన రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో సెంచరీతో మెరిశాడు. మంచి ఫామ్ లో ఉన్నా తనకు అవకాశం ఇవ్వకపోవడంపై ఈ వెటరన్ క్రికెటర్ ఆందోళన వ్యక్తం చేశాడు. 

తాజాగా ఒక ఇంటర్వ్యూలో రహానే మాట్లాడుతూ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియాపై అద్భుతంగా ఆడినా తనకు తప్పించడాన్ని గుర్తు చేసుకొని బాధపడ్డాడు. తనకు కారణం లేకుండా తప్పించారని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌పై విమర్శలు గుప్పించాడు. " వరల్డ్  టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు ఎంపికయ్యాను. ఫైనల్లో బాగా ఆడినా జట్టులోంచి నన్ను తప్పించారు. దేశీయ క్రికెట్ తో పాటు ఐపీఎల్ బాగా ఆడాను. దక్షిణాఫ్రికా ఒక సవాలుతో కూడిన సిరీస్ అని నాకు తెలుసు. ఈ సిరీస్ కు నన్ను సెలక్ట్ చేస్తారని ఆశించినా అది జరగలేదు. ఈ విషయం నన్ను బాధించింది. అగార్కర్ కు నాకు మధ్య ఎటువంటి కమ్యూనికేషన్ లేదు. నా చేతుల్లో ఉన్నది మాత్రమే నేను చేయగలను. నేను భారత జట్టులో తిరిగి చోటు సంపాదిస్తాననే నమ్మకం ఉంది". అని రహానే అన్నాడు. 

ALSO READ | Cameron Green: ప్రియురాలితో ఆస్ట్రేలియా ఆజహానుభాహుడు నిశ్చితార్ధం

రహానే 2022 లో దక్షిణాఫ్రికా సిరీస్ తర్వాత పేలవ ఫామ్ తో టెస్టు జట్టులో స్థానం కోల్పోయాడు. అయితే ఐపీఎల్ లో అద్భుతమైన ప్రదర్శనతో డబ్ల్యూటీసీ ఫైనల్లో చోటు సంపాదించిన రహానే రెండు ఇన్నింగ్స్ ల్లో వరుసగా 89,46 పరుగులు చేశాడు. కెరీర్ గాడిలో పడిందనుకున్న సమయంలో  జులైలో విండీస్ టూర్ లో జరిగిన టెస్ట్ సిరీస్ లో దారుణంగా విఫలమవడం రహానేకు ప్రతికూలంగా మారింది. జాతీయ జట్టుకు దూరమైన రహానే.. దేశవాళీ క్రికెట్‌లో రెగ్యులర్‌గా ఆడుతున్నాడు. ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్ ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో 45.76 సగటుతో 13,000కిపైగా పరుగులు చేశాడు. లిస్ట్ ఏ క్రికెట్‌లో 39.72 సగటుతో  6475 పరుగులు చేశాడు.