IPL 2025: అనుభవాన్ని ఏదీ ఓడించలేదు.. దిగ్గజ క్రికెటర్‌పై కోల్‌కతా కెప్టెన్ ప్రశంసలు

IPL 2025: అనుభవాన్ని ఏదీ ఓడించలేదు.. దిగ్గజ క్రికెటర్‌పై కోల్‌కతా కెప్టెన్ ప్రశంసలు

డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ 2025 కొత్త స్టాఫ్ తో బరిలోకి దిగబోతుంది. 2024 సీజన్ లో కేకేఆర్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన గౌతమ్ గంభీర్, అభిషేక్ నాయర్, ర్యాన్ టెన్ డోస్చేట్ భారత జట్టులో చేరడంతో కొత్త సిబ్బందిని నియమించింది. చంద్రకాంత్ పండిట్ ప్రధాన కోచ్ గా భరత్ అరుణ్ బౌలింగ్ కోచ్‌గా ఎంపికయ్యారు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ను రిటైన్ చేసుకోకుండా వదిలేయడంతో కొత్త కెప్టెన్ గా అజింక్య రహానేకు కెప్టెన్సీ దక్కింది. ఎన్నో టీ20 మ్యాచ్ లాడిన అనుభవం ఉన్న డ్వేన్ బ్రావో కోల్ కతా జట్టుకు మెంటార్ గా వ్యవహరించనున్నాడు.

ఐపీఎల్ 2025 సీజన్ ను కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తమ ప్రయాణాన్ని ఒక ప్రత్యేకమైన పూజా కార్యక్రమంతో ప్రారంభించింది. ప్రధాన కోచ్ చంద్రకాంత్ పండిట్, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, కెప్టెన్ అజింక్య రహానే  బుధవారం (మార్చి 12) ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన పూజా కార్యక్రమానికి హాజరయ్యారు. ఎన్నో అంచనాల మధ్య టైటిల్ బరిలోకి దిగుతున్న కేకేఆర్ ఈ సారి టైటిల్ నిలబెట్టుకోవాలంటే తీవ్రంగా శ్రమించాల్సిందే. ఎందుకంటే ఈ సారి మెంటార్ గంభీర్ లేకపోవడమే ఇందుకు కారణం.

Also Read:-హార్దిక్‌పై నిషేధం.. తొలి మ్యాచ్‌కు ముంబై కెప్టెన్‌గా సూర్య..

గత సీజన్ లో గంభీర్ మెంటార్ గా గంభీర్ కేకేఆర్ ను ముందుండి నడిపించాడు. రానున్న సీజన్ కోసం గంభీర్ స్థానంలో మెంటార్ గా వచ్చిన వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ డ్వేన్ బ్రావో జట్టును ఎలా నడిపిస్తాడో ఆసక్తిరంగా మారింది. ఈ నేపథ్యంలో కేకేఆర్ కొత్త కెప్టెన్ బ్రావోపై  ప్రశంసలు కురిపించాడు. అతని అనుభవం జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించాడు.

"బ్రావోతో కలిసి పని చేయడం చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది. అతను చరిత్రలో అత్యధిక  టీ 20 మ్యాచ్ లాడిన ఆటగాళ్లలో రెండోవాడు. అతని అనుభవం జట్టుకు చాలా పనికొస్తుంది. అతను చాలా కష్టపడి పనిచేసే వ్యూహకర్త. ఎప్పుడూ బౌండరీ లైన్ చుట్టూ తిరగడం.. బౌలర్లతో మాట్లాడటం నేను చూశాను. కాబట్టి అతనితో కలిసి పని చేయడానికి ఆతృతగా ఎదురు చూస్తున్నాను". అని రహానే విలేకరుల సమావేశంలో అన్నారు.

తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌(KKR), రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(RCB) జట్టుతో తలపడనుంది. ఈ  మ్యాచ్‌కు ఈడెన్‌గార్డెన్స్‌ వేదిక. కోల్‌కతా నైట్ రైడర్స్ సొంత మైదానం, ఐకానిక్ స్టేడియం ఈడెన్ గార్డెన్స్ టోర్నీ ప్రారంభ మ్యాచ్, ఫైనల్‌కు ఆతిథ్యమివ్వనుంది. నరైన్, వరుణ్ చక్రవర్తి రూపంలో ఆ జట్టులో ఇద్దరు మిస్టరీ స్పిన్నర్లు ఉన్నారు. ఫినిషర్లుగా రింకూ సింగ్, రస్సెల్, రమణ్ దీప్ సింగ్ సిద్ధంగా ఉన్నారు. రహానే, వెంకటేష్ అయ్యర్ మిడిల్ ఆర్ద్ర భారాన్ని మోయనున్నారు. ఫాస్ట్ బౌలర్లుగా హర్షిత్ రానా, వైభవ్ అరోరా, అన్రిచ్ నోకియా సత్తా చాటనున్నారు.