
న్యూఢిల్లీ: ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ తమ కొత్త కెప్టెన్‌ను ప్రకటించింది. టీమిండియా వెటరన్ బ్యాటర్ అజింక్యా రహానెకు కెప్టెన్సీ అప్పగిస్తున్నట్టు సోమవారం వెల్లడించింది. 36 ఏండ్ల రహానె ఇండియా టీమ్‌కు దూరమైనా కొన్నాళ్లుగా డొమెస్టిక్ క్రికెట్ షార్ట్ ఫార్మాట్‌లో సత్తా చాటుతున్నాడు. గత సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో 164.56 స్ట్రయిక్ రేట్‌తో 469 రన్స్ చేసి ఆకట్టుకున్నాడు. గత సీజన్‌లో కేకేఆర్‌కు ట్రోఫీ అందించిన శ్రేయస్ అయ్యర్ స్థానంలో రహానె ఇప్పుడు ఆ టీమ్‌ను నడిపించనున్నాడు.
గతంలో కోల్‌కతాకు ప్రాతినిధ్యం వహించిన రహానెను వేలంలో ఆ ఫ్రాంచైజీ రూ. కోటిన్నరకే కొనుగోలు చేసింది. ఇది వరకు అతను రాజస్తాన్ రాయల్స్ జట్టుకు నాయకత్వం వహించాడు. మరోవైపు కేకేఆర్ డ్యాషింగ్ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. కాగా, పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీలో చేరిన శ్రేయస్ ఆ టీమ్‌కు కెప్టెన్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ నెల 22న ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే సీజన్ తొలి మ్యాచ్‌లో ఆర్సీబీతో కేకేఆర్ పోటీ పడనుంది.