
టీ20 వరల్డ్ కప్ కోసం జట్టును ప్రకటించగానే స్క్వాడ్ లో ఏదైనా ఆశ్చర్యపరిచే అంశం ఏదైనా ఉందంటే అది కేఎల్ రాహుల్ ను ఎంపిక చేయకపోవడమే. అనుభవజ్ఞుడైన ఈ వెటరన్ ప్లేయర్ ను ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. వికెట్ కీపర్ బ్యాటర్లుగా రిషబ్ పంత్ తో పాటు ఐపీఎల్ లో సూపర్ ఫామ్ లో ఉన్న సంజు శాంసన్ కు అవకాశమిచ్చారు.దీంతో రాహుల్ కు నిరాశ తప్పలేదు. రాహుల్ అనుభవం కంటే కుర్రాళ్లపైనే సెలక్టర్లు నమ్మకముంచారు.
ఇదే సమయంలో కేఎల్ రాహుల్ అభిమానులు రాహుల్ ను ఎంపిక చేయకపోవడంతో మండిపడుతున్నారు. అయితే ఈ ప్రశ్నకు తాజాగా టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, కెప్టెన్ రోహిత్ శర్మ క్లారిటీ ఇచ్చారు. " కెఎల్ అసాధారణమైన ప్లేయర్. కానీ రాహుల్ టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేస్తున్నాడు. మేము మిడిల్ ఆర్డర్ వికెట్ కీపర్ కోసం ఆలోచించాం. పంత్, సంజు శాంసన్ మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉందని మేము భావించాం. వీరిద్దరిని ఎంపిక చేయడానికి ఇదే కారణం". అని అజిత్ అగార్కర్ అన్నారు.
ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో రాహుల్ 9 మ్యాచ్ ల్లో 378 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 144.27 గా ఉంది. మరోవైపు పంత్, సంజు శాంసన్.. రాహుల్ కంటే మెరుగైన ప్రదర్శన చేస్తున్నారు. శాంసన్ స్ట్రైక్ రేట్ 161.09 గా ఉంటే.. పంత్ స్ట్రైక్ రేట్ 158.57గా ఉంది. ఈ గణాంకాల ఆధారంగానే రాహుల్ ను పక్కన పెట్టినట్టు తెలుస్తుంది. రాహుల్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న లక్నో టీం అదరగొడుతుంది. ఆడిన 10 మ్యాచ్ ల్లో 6 విజయాలు సాధించి ప్లే ఆఫ్ కు దగ్గరలో ఉంది.
Ajit Agarkar said, "KL Rahul has been opening in the IPL. We were mainly looking for middle-order options. So, we felt that Samson and Pant are better suited for that. Samson can bat anywhere in the lineup. So, it was just about what we needed and not about who was better". pic.twitter.com/q92qO1sYFz
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 2, 2024