శరద్‌ పవార్‌తో టచ్‌లోకి అజిత్ పవార్ ఎమ్మెల్యేలు!

శరద్‌ పవార్‌తో టచ్‌లోకి అజిత్ పవార్ ఎమ్మెల్యేలు!
  • జయంత్ కామెంట్లను ఖండించిన అజిత్ వర్గం

ముంబై : మహరాష్ట్రలో  రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి. అజిత్ పవార్ ఎన్సీపీ వర్గానికి చెందిన దాదాపు 10–-15 మంది ఎమ్మెల్యేలు శరద్‌ పవార్‌తో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. పలువురు నేతలు తమతో టచ్‌లో ఉన్నారని ఏ పార్టీ పేరు చెప్పకుండా ఎన్సీపీ (శరద్‌ పవార్‌) రాష్ట్ర చీఫ్ జయంత్ పాటిల్ గురువారం కామెంట్ చేశారు. ఈ నెల 9న జరిగే సమావేశంలో ఈ ప్రతిపాదనల గురించి చర్చిస్తామన్నారు.

అయితే, జయంత్ పాటిల్ కామెంట్లపై అజిత్ పవార్ ఎన్సీపీ వర్గం మండిపడింది. తమ వర్గం నుంచి ఎవ్వరూ  శరద్‌ పవార్‌తో టచ్‌లో  లేరని వెల్లడించింది. మహరాష్ట్రలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి(బీజేపీ, ఎన్సీపీ, శివసేన(అజిత్)) బోల్తా పడింది. మొత్తం 48 స్థానాల్లో కేవలం 17 స్థానాలను మాత్రమే గెలుచుకుంది.

ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమి(కాంగ్రెస్, శరద్ ఎన్సీపీ, ఉద్ధవ్ శివసేన) 30 స్థానాలను కైవసం చేసుకుంది. ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష కూటమికి అత్యధిక సీట్లు రావడం ప్రభుత్వాన్ని అయోమయంలో పడేసింది.